Prashanth Neel : కన్నడ సినిమా ఇండస్ట్రీలో తన కంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel)…పాన్ ఇండియాలో ఆయన చేసిన కేజీఎఫ్ (KGF) సినిమాకి మంచి ఆదరణ అయితే దక్కింది. ఇక ఆ సినిమాకి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఆయన ఆ తర్వాత చేసిన సలార్ (Salaar) సినిమా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రభాస్ లాంటి స్టార్ హీరో చేసిన ఈ సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసిందనే చెప్పాలి. దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టి ప్రభాస్ సక్సెస్ ఫుల్ సినిమాల్లో ఈ సినిమా కూడా ఒకటిగా నిలవడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి… ఇక ప్రస్తుతం ప్రశాంత్ నీల్(Prashanth Neel) జూనియర్ ఎన్టీఆర్ తో డ్రాగన్ (Drogan) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తను ఎలాంటి ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడు. తద్వారా ఆయనకు ఒక సపరేట్ క్రేజ్ వస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ఎన్టీఆర్ మాత్రం ఈ సినిమా కోసం తెగ కష్టపడి పోతున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన క్యారెక్టర్ కోసం వెయిట్ బాగా తగ్గిన జూనియర్ ఎన్టీఆర్ ఆయన చేయబోయే పాత్రకి ఎలాంటి గుర్తింపు వస్తుంది అనేది తెలియాల్సి ఉంది.
Also Read :ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ గ్లింప్స్ వచ్చేది అప్పుడేనా..?
జూనియర్ ఎన్టీఆర్ మాత్రం కెరియర్ స్టార్టింగ్ లో తనకు దక్కిన సింహాద్రి (Simhadri) సినిమా వల్ల అతనికి ఎలాంటి గుర్తింపు అయితే వచ్చిందో ఇప్పుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) చేస్తున్న ఈ సినిమాతో కూడా అలాంటి గుర్తింపు వస్తుంది అనే ఒక భారీ కాన్ఫిడెంట్ అయితే వ్యక్తం చేస్తున్నాడు.
తను అనుకున్నట్టుగానే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించి జూనియర్ ఎన్టీఆర్ ను మరోసారి మాస్ హీరోగా నిలబెట్టడమే కాకుండా ఇండస్ట్రీ హిట్స్ ని కూడా సాధించి పెడుతుందా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నా ఎన్టీఆర్ భారీ స్టంట్స్ చేస్తూ సినిమా మీద హైప్ ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రశాంత్ నీల్ ఈ సినిమా మీదనే తన పూర్తి ఫోకస్ ని కేటాయించి ముందుకు సాగుతూ ఉండటం విశేషం.
Also Raed : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ నుండి బ్లాస్టింగ్ అప్డేట్ వచ్చేసింది!