Prashanth Neel and Jr NTR : కన్నడ సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చి పాన్ ఇండియా సినిమాలను చేస్తూ భారీ విజయాలను అందుకునే స్థాయికి ఎదిగిన దర్శకుడు ప్రశాంత్ నీల్… ప్రస్తుతం ఆయన నుంచి ఒక సినిమా వస్తుందంటే చాలు ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తిలేదు. ఇక ఈ సినిమాతో ఇండియన్ సినిమాలను చేసి సూపర్ డూపర్ సక్సెస్ లను అందుకున్నాడు. ఇక ఆ తర్వాత ప్రభాస్ తో సలార్ సినిమాను చేసి ఆయనకి భారీ సక్సెస్ ను అందించాడు. ఈ సినిమాతో దాదాపు 800 కోట్ల వరకు కలెక్షన్లు కొల్లగొట్టాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ తో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అవుతాయని చెబుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా మీద ఎన్టీఆర్ అభిమానులైతే భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక ఈ సినిమా ఎలాంటి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది అనే విషయాలను పక్కన పెడితే ఈ సినిమాతో విజయాన్ని దక్కించుకొని రెండు వేల కోట్ల మార్కును కూడా టచ్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా సినిమా చూస్తున్న ప్రతి దర్శకుడు కూడా రెండు వేల కోట్ల మార్క్ ను టచ్ చేయాలని చూస్తున్నారు. మరి అలాంటి ఒక భారీ మార్కును సెట్ చేయాలంటే అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు.
Also Read : ఎన్టీయార్ – నెల్సన్ కాంబోలో సినిమా ఫిక్స్ అయిందా..? క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్…
ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉండాలి. అలాగే సినిమాలోని సీన్లు హై లెవెల్లో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధిస్తుంది. లేకపోతే మాత్రం ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.
చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు కష్టపడుతున్నారు. ఇక కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రశాంత్ నీల్ సైతం తెలుగు హీరోలతో ఎక్కువగా సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి ఏది ఏమైనా కూడా ఆయన ఎన్టీఆర్ తో చేస్తున్న సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉన్నాయట.
మరి ఈ యాక్షన్ ఎపిసోడ్ లో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ తో కత్తి పట్టించబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ మాస్ అవతారం ఎత్తి కత్తి పడితే ఏ రేంజ్ లో ఉంటుందో మనం సింహాద్రి సినిమాలోనే చూశాం. మరి మరోసారి ఇప్పుడు అలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతున్నట్టుగా తెలుస్తోంది…
Also Read : ఎన్టీయార్ ను మూడు రోజులు ఉపవాసం ఉంచిన ప్రశాంత్ నీల్…కారణం ఏంటంటే..?