Prashanth Neel: తెలుగు సినిమా స్థాయిని పాన్ ఇండియా రేంజ్ కి తీసుకెళ్లిన డైరెక్టర్ రాజమౌళి. ప్రస్తుతం రాజమౌళి తనదైన రీతిలో సినిమాలను చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్నాడు. పాన్ ఇండియా రేంజ్ లోనే కాకుండా హాలీవుడ్ స్థాయి లో సినిమాలు తీయగలిగే సత్తా ఉన్న ఒకే ఒక ఇండియన్ డైరెక్టర్ రాజమౌళి…
ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా హాలీవుడ్ రేంజ్ లో ఉండబోతుందనే సమాచారం అయితే అందుతుంది. ఇక దీన్ని బట్టి చూస్తుంటే రాజమౌళి హాలీవుడ్ లో తెలుగు సినిమాని ఒక స్థాయిలో నిలపబోతున్నాడు అనే సమాచారం అయితే అందుతుంది. ఇక దీంతో పాటుగా రాజమౌళికి కొన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయి…అవి ఏంటి అంటే రాజమౌళి ఒక సినిమా తీయడానికి దాదాపు మూడు నుంచి నాలుగు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు. అందులో భాగంగానే తన సినిమాలో చేసే హీరోని కూడా అన్ని సంవత్సరాలు తన ఒక్క సినిమా మీదే కమిట్ అయి ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అంటే ఈయన సినిమా చేసినప్పుడు ఆ హీరో వేరే ఇంకే సినిమా చేయకూడదని కండిషన్ ని కూడా పెడతాడు. ఎందుకంటే ఈయన సినిమాకి ఎక్కువ డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే ఆయన తన సినిమాకి ఒప్పుకున్న హీరోని తన ఒక్క సినిమాకే పరిమితం చేస్తాడు.
దీనివల్ల హీరోలు ఇక వేరే సినిమాలు చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. ఒక మూడు సంవత్సరాలు మొత్తానికి ఒకే సినిమా మీద కేటాయించాల్సిన అవసరం అయితే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు రాజమౌళికి ఇదొక సవాల్ గా ఎదురవుతుంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ 3 సంవత్సరాల్లో మూడు సినిమాలు తీసేసి స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు. అలాగే రాజమౌళి ఇద్దరు స్టార్ హీరోలను పెట్టుకొని చేసిన ఆర్ఆర్ఆర్ సినిమా 1200 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది. కానీ కేజీఎఫ్ 2 సినిమా ఆర్ఆర్ఆర్ ని బీట్ చేస్తూ 1300 కోట్ల కు పైన కలక్షన్స్ ను వసూలు చేసి రాజమౌళి లాంటి స్టార్ డైరెక్టర్ కి ప్రశాంత్ నీల్ పెద్ద షాక్ ఇచ్చాడు.
ఇక గత నాలుగు సంవత్సరాల్లో రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా ఒకటి మాత్రమే చేసి 1200 కోట్లు కలెక్ట్ చేస్తే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్, కెజీఎఫ్ 2, సలార్ మూడు సినిమాలు చేసి దాదాపు 3000 కోట్ల దాకా వసూళ్లను సాధించాడు.ప్రస్తుతం సలార్ సినిమా 500 కోట్లు మార్కు దాటి 1000 కోట్లు సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తుంది. మరి ఇలాంటి సమయంలో రాజమౌళి మీద కంటే ప్రశాంత్ నీల్ మీదనే ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు ఆసక్తిని చూపే అవకాశాలు కూడా ఉన్నాయి. వీటన్నింటికి భారీ రేంజ్ లో రాజమౌళి మహేష్ బాబు తో తీసే సినిమాతో సమాధానం చెప్పాలి. లేకపోతే మాత్రం రాజమౌళి క్రెడిబిలిటీ అనేది చాలా వరకు పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…