Rahul Gandhi : భారత్‌జోడో యాత్రతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ గతేడాది చివరి నుంచి ఈ ఏడాది ప్రారంభం వరకు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేశారు. సుమారు 3500 కిలోమీటర్లకుపైగా నడిచారు. ఆయన పాదయాత్ర ఫలితంగా దేశంలో కాంగ్రెస్ కాస్త బలం పుంజుకుంది. అయితే ఎన్నికల్లో మాత్రం ఆశించిన ఫలితాలు రావడం లేదు. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగగా కేవలం తెలంగాణలో మాత్రమే విజయం సాధించింది. అధికారంలో ఉన్న ఛత్తీస్‌గడ్, రాజస్థాన్‌లో అధికారం కోల్పోయింది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ రాహుల్ పాదయాత్ర చేశారు. కానీ ఫలితాలు మాత్రం నిరాశపర్చాయి. ఇక ఆరు నెలల క్రితం జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ విజయం సాధించింది.
దక్షిణాదిన సత్ఫలితాలు..
రాహుల్‌గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ధక్షిణ భారత దేశంలో సత్ఫలితాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆయన యాత్ర తర్వాత దక్షిణ భారతంలోని కర్ణాటక, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ రెండు రాష్ట్రా్టల్లో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్, హర్యాన, ఢిల్లీ మీదుగా రాహుల్ భరత్ జోడో యాత్ర సాగింది. తూరు, పశ్చిమ రాష్ట్రాలు ఆయన యాత్రలో టచ్ కాలేదు. ఆయన కూడా చేయలేదు. ఈ నేపథ్యంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు మరో యాత్ర చేయాలని రాహుల్ నిర్ణయించారు. భారత్ జోడో యాత్ర – 2 చేపట్టాలని మొదట భావించారు. కానీ, తక్కువ సమయంలో పాదయాత్ర చేయడం సాధ్యం కాదని భావించిన కాంగ్రెస్ పెద్దలు కొద్ది మార్పులతో మరో యాత్రకు రూపకల్పన చేశారు.
భారత్ న్యాయ యాత్ర..
భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగానే రాహుల్‌గాంధీ భారత్ న్యాయ యాత్ర చేయాలని నిర్ణయించారు. మణిపూర్ నుంచి ముంబై వరకు బస్సు, పాదయాత్రగా ఆయన ఈ యాత్ర చేపట్టనున్నారు. జనవరి 14 నుంచి మార్చి 20 వరకు ఈ యాత్ర చేపట్టేలా కాంగ్రెస్ ప్రణాళికి సిద్దం చేస్తోంది. నాగాలాండ్, మేఘాలయ, బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గడ్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ మీదుగా ఆయన యాత్ర ముంబైకి చేరుకుంటుంది. సుమారు 6,200 కిలోమీటర్లు ఈ భారత్ న్యాయ యాత్ర సాగుతుందని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. తక్కువ సమయంలో ఎక్కువ దూరం ప్రయాణించేలా హైబ్రిడ్ పద్ధతిలో యాత్రకు రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. మరి ఈ యాత్ర కాంగ్రెస్ను లోక్ సభ ఎన్నికల్లో కట్టెక్కిస్తుందో లేదో చూడాలి.