Prashanth Neel Vs Rajamouli: పరిశ్రమలో మాస్ దర్శకులదే హవా. స్టార్ హీరోలు వాళ్ళకే అవకాశాలు ఇస్తారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ ని మెజారిటీ ఆడియన్స్ ఇష్టపడతారు. ఆ తరహా సినిమా తీసే వాళ్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ దేశం మెచ్చిన కమర్షియల్ డైరెక్టర్ గా రికార్డులకు ఎక్కాడు. కేవలం నాలుగు సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ చేశాడు. అపజయం ఎరుగని దర్శకుడిగా రికార్డులకు ఎక్కాడు. ప్రశాంత్ నీల్ నాలుగు చిత్రాల వసూళ్లు రూ. 2000లకు పైగా ఉండటం అరుదైన రికార్డు.
మొదటి నాలుగు సినిమాలతో ఇన్ని వేల కోట్ల వసూళ్ళు సాధించిన డైరెక్టర్ మరొకరు లేరు అనడంలో సందేహం లేదు. రాజమౌళి బాహుబలి, బాహుబలి 2, ఆర్ ఆర్ ఆర్ చిత్రాలతో రెండు వేలకు పైగా వసూళ్లు రాబట్టారు. అయితే ఇవి ఆయన కెరీర్ బిగినింగ్ మూవీస్ కాదు. కాబట్టి ఆ విషయంలో ప్రశాంత్ నీల్ రాజమౌళి కంటే తోపు అనాలి. కాగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన చిత్రాల బడ్జెట్, అవి సాధించిన వసూళ్లు చూద్దాం…
ప్రశాంత్ నీల్ డెబ్యూ మూవీ ఉగ్రం. ఈ కన్నడ చిత్రంలో శ్రీ మురళి హీరోగా నటించాడు. ఈ చిత్ర బడ్జెట్ కేవలం నాలుగు కోట్లు. సూపర్ హిట్ కొట్టి రూ. 14 కోట్లు వసూలు చేసింది. 2014లో విడుదలైంది. ఇక రెండో చిత్రమే పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేశాడు. నాలుగేళ్లు గ్యాప్ తీసుకుని కెజిఎఫ్ చాప్టర్ 1 చేశాడు. ఈ చిత్ర బడ్జెట్ రూ. 80 కోట్లు. అన్ని భాషల్లో ఆదరణ దక్కించుకున్న కెజిఎఫ్ రూ. 250 కోట్ల వసూళ్లు రాబట్టింది.
దీనికి కొనసాగింపుగా కెజిఎఫ్ 2 తెరకెక్కించాడు ప్రశాంత్ నీల్. నాలుగేళ్ళ గ్యాప్ తో 2022లో విడుదలైన కెజిఎఫ్ 2 బాక్సాఫీస్ బద్దలు కొట్టింది. ఏకంగా రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ చిత్ర బడ్జెట్ కేవలం రూ. 100 కోట్లు. ఇక లేటెస్ట్ సెన్సేషన్ సలార్ మూవీని రూ. 250 కోట్లతో తెరకెక్కించారు. ఈ చిత్రం ఇప్పటి వరకు రూ. 500 కోట్ల గ్రాస్ రాబట్టింది. మరోవారం సలార్ బాక్సాఫీస్ రన్ కొనసాగనుంది. కాబట్టి ప్రశాంత్ నీల్ నాలుగు చిత్రాలతోనే రూ. 2000 కోట్ల వసూళ్లు అందుకున్నాడు.