Bigg Boss Non Stop: బిగ్ బాస్ లవర్స్ కి గుడ్ న్యూస్. మరో సీజన్ కి రంగం సిద్ధం అవుతుందట. బిగ్ బాస్ నాన్ స్టాప్ కి మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారట. కంటెస్టెంట్స్ ఎంపిక కూడా మొదలైన క్రమంలో లిస్ట్ కూడా లీకైంది. ఈ మేరకు కొందరు క్రేజీ సెలెబ్స్ నేమ్స్ బయటకు వస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగు 7 గ్రాండ్ సక్సెస్. అదే స్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. అన్నపూర్ణ స్టూడియో ఎదుట బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఫ్యాన్స్ అల్లర్లకు పాల్పడ్డారు. ముఖ్యంగా అమర్ దీప్-పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గొడవలకు దిగారు.
పబ్లిక్, ప్రైవేట్ ప్రాపర్టీ ధ్వంసం అయ్యింది. పల్లవి టైటిల్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిణామం సంచలనంగా మారింది. చెప్పాలంటే షో గౌరవం దెబ్బతింది. ఈ వివాదాల నేపథ్యంలో షో రద్దు చేస్తారేమో అనే సందేహాలు కలుగుతున్నాయి. అయితే బంగారు బాతు లాంటి బిగ్ బాస్ షోని మేకర్స్ వదులుకునే అవకాశం లేదని తెలుస్తుంది.
త్వరలో బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కి రంగం సిద్ధం అవుతుందట. హాట్ స్టార్ లో ప్రసారం కానున్న బిగ్ బాస్ నాన్ స్టాప్ తెలుగు సీజన్ 2 కి ఏర్పాట్లు మొదలయ్యాయట. కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైందట. ఒక ఆరుగురి పేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీరిలో పాట బిడ్డ భోలే పేరు ఉంది. సీజన్ 7లో కంటెస్ట్ చేసిన భోలే తన పాటలతో ఫుల్ గా ఎంటర్టైన్ చేశాడు భోలే వలన ప్లస్ అవుతుందని భావించిన మేకర్స్ మరో ఛాన్స్ ఇచ్చారట.
వినాయకుడు మూవీలో హీరోయిన్ గా నటించిన సోనియా దీప్తిని ఎంపిక చేశారట. హ్యాపీ డేస్, వినాయకుడు, దూకుడు చిత్రాలతో సోనియా ఫేమ్ తెచ్చుకుంది. అల్లరి నరేష్ హీరోగా విడుదలైన యముడికి మొగుడు చిత్రంలో రిచా పనయ్ హీరోయిన్ గా నటించింది. ఆమెను కూడా తీసుకున్నారట. ఢీ ఫేమ్ యష్, సింగర్ పార్వతి, నటుడు భద్రం కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై అధికారిక సమాచారం లేదు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.