Prashanth Neel : కన్నడ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని ఆ తర్వాత కే జి ఎఫ్ సినిమాతో పాన్ ఇండియాలో తనదైన రీతిలో సత్తా చాటుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్… ఇక ప్రభాస్ తో సలార్ లాంటి సినిమాను చేసి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఈయన చేసిన సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా తీసుకొచ్చి పెట్టాయి. మరి ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఇక ప్రస్తుతం ఆయన జూనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పెట్టి ఒక భారీ సినిమాను చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా చేస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రశాంత్ నీల్ ఇండియా డైరెక్టర్ గా ఎదగడానికి ఒక దర్శకుడు కారణమని ఆయనంటే తనకు చాలా ఇష్టమని చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇక ప్రశాంత్ నీల్ కి ఇష్టమైన దర్శకుడు ఎవరు అంటే తెలుగులో టాప్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఎస్ఎస్ రాజమౌళి అని తను తెలియజేస్తూ ఉండడం విశేషం…
Also Read : మందు, సిగిరెట్స్ తో ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్..ఫోటోలు వైరల్!
ఆయన వల్లే తను ఒక పెద్ద సినిమా చేయాలని పాన్ ఇండియా నేపధ్యం లో ఆ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని తనకు వచ్చిందని బాహుబలి లాంటి సినిమా ద్వారా తను చాలా స్ఫూర్తిని పొందాలని చాలా సందర్భాల్లో తెలియజేశాడు.
మరి మొత్తానికైతే తెలుగు సినిమా దర్శకుడుని అతను అభిమానించడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఇక ప్రస్తుతం ఇద్దరు దర్శకుల మధ్య భారీ పోటీ అయితే నెలకొంది వీళ్లిద్దరూ కూడా పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను సాధించిన వారే కావడం విశేషం…
మరి రాబోయే సినిమాలతో వీళ్ళిద్దరూ ఎలాంటి సక్సెస్ ను సాధిస్తారు. తద్వారా వాళ్ళు తీవ్రమైన ప్రయత్నం చేస్తారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్లు చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు ను హీరోగా పెట్టి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే…చూడాలి మరి వీళ్ళు ఫ్యూచర్ లో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తారు అనేది…
Also Read : రామ్ చరణ్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న సినిమాలో స్టోరీ ఇదేనా..?