SBI : ఏప్రిల్ ఒకటి అంటే.. అందరికీ ప్హూల్స్ డే గుర్తుకొస్తుంది. పైగా రంజాన్ మారుసటి రోజు కావడంతో దేశం వ్యాప్తంగా మంగళవారం కూడా సెలవు కొనసాగుతోంది. ఏప్రిల్ ఒకటి నుంచి బ్యాంకులకు కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో మనదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డిజిటల్ సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. డబ్బుల చెల్లింపుల్లో అంతరాయం కలగకుండా ఉండేందుకు యూపీఐ లైట్, ఏటీఎం కార్డులను ఉపయోగించాలని సూచించింది. ” ఏప్రిల్ ఒకటి నుంచి న్యూ ఫైనాన్షియల్ ఇయర్ బిగిన్ అవుతుంది.. దీంతో బ్యాంకు కు సంబంధించి ఆర్థికపరమైన విషయాలు కొత్తగా మొదలవుతాయి. ఏడాదిపాటు ఇవి సాగుతాయి. అందువల్ల కొన్ని రకాల సేవలు తాత్కాలికంగా నిలిపివేతకు గురవుతాయి. అందువల్ల ఖాతాదారులు డిజిటల్ సేవలు అందుకోలేరు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డిజిటల్ సేవలు అందుబాటులో ఉండవు. నగదు చెల్లింపుల్లో అంతరాయం చోటు చేసుకోకుండా ఉండడానికి యూపిఐ లైట్, ఏటీఎం సేవలను వినియోగించుకోవాలని” స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాజమాన్యం సామాజిక మాధ్యమాల వేదికగా ఖాతాదారులకు సూచించింది.
Also Read : UPI ద్వారా పే మెంట్లు చేస్తే 1500 కోట్లు మీవే..
మిగతా బ్యాంకులు..
మిగతా బ్యాంకులకు ఆర్థిక సంవత్సరం ఈరోజే ప్రారంభమవుతున్నప్పటికీ.. వాటికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాయిలో ఖాతాదారులు లేరు. అందువల్లే వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఆ బ్యాంకులు డిజిటల్ సేవలను యధావిధిగా కొనసాగిస్తున్నాయి. దీంతో ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కావడం లేదు. ఇక ఇటీవల కాలంలో యూపీఐ లో చోటు చేసుకున్న సాంకేతిక అంతరాయం వల్ల ఫోన్ పే సేవలు నిలిచిపోయాయి. గూగుల్ పే సేవలు కూడా ఆగిపోయాయి. చివరికి యూపీఐ లో సాంకేతిక సమస్య పరిష్కారం కావడంతో ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను తిరిగి కొనసాగించారు. ఇక యూపీఐ ద్వారా అత్యధికంగా లావాదేవీలు నిర్వహించే వారిలో ఎక్కువగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు ఉన్నారు. ప్రతిరోజు యూపీఐ ద్వారా కోట్ల రూపాయల చెల్లింపులను జరుపుతున్నారు.. అయితే మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు డిజిటల్ లావాదేవీలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఖాతాదారులు జరపలేరు. దాదాపు మూడు గంటల వరకు లావాదేవీలు నిలిచిపోవడం వల్ల ఖాతాదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది.. యూపీఐ లైట్ మీద చాలామందికి అవగాహన లేదు. అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిజిటల్ లావాదేవీల పై కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో మూడు గంటల పాటు ఖాతాదారులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ” మొన్ననేమో యూపీఐ లో సాంకేతిక సమస్య ఎదురయింది. చాలాసేపటి వరకు లావాదేవీలు నిర్వహించలేకపోయాం. ఇప్పుడేమో ఇలా జరుగుతోంది. డిజిటల్ చెల్లింపుల్లో తరచు ఇలాంటి అవరోధాలు ఏర్పడితే ఇబ్బందులు తప్పవు. ఏదైనా సమస్య ఉంటే ముందే పరిష్కరించుకోవాలి. లేదా ముందుగానే చెప్పాలి. ఆకస్మాత్తుగా నిర్ణయం తీసుకుంటే ఇబ్బంది పడక తప్పదని” ఖాతాదారులు సోషల్ మీడియా వేదికగా వాపోతున్నారు.