Pradeep Machiraju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నారు. కొంతమంది స్టార్ డైరెక్టర్లు సైతం పాన్ ఇండియాలో సినిమాలను చేస్తూ భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నారు. ఇంకా కొంతమంది కొత్త దర్శకులు చిన్న సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని ఏర్పాటు చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు…
Also Read: హిట్ మూవీ కొత్త పోస్టర్ మామూలుగా లేదుగా…నాని అరాచకం అంతే..?
సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలు వరుసగా సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇలాంటి క్రమంలోనే యాంకర్ ‘ప్రదీప్ మాచిరాజు’ (Pradeep Machiraju) సైతం హీరోగా మారి ‘అక్కడ అబ్బాయి ఇక్కడ అబ్బాయి’ అనే సినిమా చేశాడు. అయితే ఈ సినిమాకి మొదటి రోజు పాజిటివ్ టాక్ అయితే వచ్చింది. కానీ కలెక్షన్స్ పరంగా మాత్రం ఈ సినిమా కొంతవరకు వెనుకబడిపోతుందనే చెప్పాలి. మరి ఇలాంటి క్రమంలోనే ట్విట్టర్ లో ఒక వ్యక్తి ప్రదీప్ కోసం ఈ సినిమా చూద్దామని అనుకున్నాను కానీ సినిమా అంత బాలేదట సినిమాకి పెట్టే డబ్బులతో ఒక బిర్యానీ తెచ్చుకొని తింటూ ఓటిటిలో కోర్టు మూవీ చూస్తాను అంటూ ట్వీట్ చేయడంతో అది వైరల్ అయింది. ఇక దానికి తగ్గట్టుగానే ఈ ట్వీట్ కి రెస్పాండ్ అయిన యాంకర్ ప్రదీప్ సైతం రీ ట్వీట్ చేస్తూ మూవీ బాగుంటుంది ఒకసారి ట్రై చేయొచ్చు అంటూ మీరైతే మూవీ చూడండి మీకు కావాల్సిన బిర్యానీ నేను పంపిస్తాను అంటూ ఆయన రీ ట్వీట్ చేయడంతో ప్రస్తుతం అది సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే ఇప్పుడు ఆ వ్యక్తి సినిమా చూసాను మూవీ బాగుంది. కానీ బిర్యానీ డబ్బులు అయిపోయాయి అయిన పర్లేదు నవ్వులతో కడుపు నింపుకొని పడుకుంటా అంటూ ట్వీట్ చేశాడు ప్రదీప్ దానికి థాంక్యూ వెరీ మచ్ బ్రదర్ అంటూ రీ ట్వీట్ చేశాడు….
మరి ఏది ఏమైనా కూడా ప్రదీప్ యాంకర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి ఒక హీరోగా మారడం అనేది నిజంగా చాలా మంచి విషయమనే చెప్పాలి. మరి ఈ సినిమాతో నితిన్, భారత్ ఇద్దరు కూడా దర్శకులుగా మారారు. ఇప్పటివరకు జబర్దస్త్ ప్రోగ్రాం తో మంచి గుర్తింపు కూడా సంపాదించుకున్న వీళ్ళు ఈ సినిమాతో డైరెక్టర్ గా మారడమే కాకుండా వల్ల కాంతి ఒక ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మరి ఇలాంటి సందర్భంలో వాళ్ళు ఇక మీదట ఎలాంటి సినిమాలు చేయబోతున్నారు. మరిన్ని సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటారా లేదా అనేది తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లందరూ భారీ విజయాలను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న క్రమం లో నితిన్ భరత్ లు ఇక మీదట మరి కొంతమంది యంగ్ హీరోలతో సినిమాలు చేసి వాళ్లను వాళ్ళు గొప్ప డైరెక్టర్లు గా ప్రూవ్ చేసుకుంటారా? లేదా అనేది తెలియాల్సి ఉంది…