https://oktelugu.com/

Prasanth Varma: పక్క వాళ్ల కథల మీద డిపెండ్ అవుతున్న ప్రశాంత్ వర్మ… కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు భారీ సినిమాలు చేస్తూ స్టార్ డైరెక్టర్లుగా ఎదుగుతూ తమ సత్తా చాటుతున్నారు. కానీ యంగ్ డైరెక్టర్లు సైతం కొత్త కథలతో చిన్న సినిమాలను రూపొందిస్తూ పాన్ ఇండియాలో పెద్ద సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఇది చూసిన స్టార్ డైరెక్టర్లు కొంతవరకు నిరాశ చెందుతున్నప్పటికి యంగ్ డైరెక్టర్లు మాత్రం కొత్త కథలతో రావడం తెలుగు సినిమా స్థాయిని పెంచుతుందనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : October 27, 2024 / 03:32 PM IST

    Prasanth Varma

    Follow us on

    Prasanth Varma: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న వారిలో ప్రశాంత్ వర్మ ఒకరు. ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ‘హనుమాన్’ సినిమా భారీ సక్సెస్ ని సాధించడంతో ఆయన ఒక్కసారిగా పాన్ ఇండియాలో స్టార్ డైరెక్టర్ గా ఎదిగాడు. నిజానికి ఆయన నుంచి చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయన ప్రశాంత్ వర్మ యూనివర్స్ కింద చాలా సినిమాలను తెరకెక్కించే పనిలో పడ్డాడు. ఆయన కొన్ని సినిమాలకు కథ, మాటలు అందిస్తూ దర్శకత్వం విభాగంలో నైపుణ్యం ఉన్న కొత్త వాళ్లకి డైరెక్షన్ అవకాశాలను కూడా ఇస్తున్నాడు. ఇక అలాగే కొంతమంది రైటర్స్ చేత కథలను రాయిస్తూ వాళ్ల దగ్గరి నుంచి వాటిని కొనుక్కుంటూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు.ప్రస్తుతం ఆయన ఒక మూడు నాలుగు సినిమాలకు వర్క్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీని ద్వారా ఆయనకు రెమ్యూనరేషన్ విషయంలో భారీగా డబ్బులు రావడమే కాకుండా తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన డైరెక్షన్ లో జై హనుమాన్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాని తొందర్లోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ప్రశాంత్ వర్మ లాంటి క్రియేటివ్ డైరెక్టర్ ఇప్పుడు పక్కవాళ్ళ కథ మీద ఆధారపడుతున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి.

    తన యూనివర్స్ లో సినిమాలు చేయడానికి ఆయన ఇతరుల దగ్గర నుంచి కథలను కొనుక్కుంటున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలాంటి విషయాల్లో ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండాలి.

    ఎందుకంటే పక్కవాళ్ళ కథలు ఆయనను ఇంపాక్ట్ చేసినంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోవచ్చు. దాని ద్వారా కథ ఏదైనా తేడా కొడితే మాత్రం ఆయనకు భారీగా నష్టం వాటిల్లే ప్రమాదం అయితే ఉంది.దాని ద్వారా తన ఐడెంటిటీ కోల్పోవడమే కాకుండా తన మార్కెట్ కూడా భారీగా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి.

    ఇక క్రేజ్ విషయంలో ప్రస్తుతం మంచి టాప్ రేంజ్ లో ముందుకు సాగుతున్న ప్రశాంత్ వర్మ అదే రీతిలో వరుస సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు. చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి పెను ప్రభంజనాన్ని సృష్టిస్తాడు అనేది… ఏది ఏమైనా కూడా తను తాను స్టార్ డైరెక్టర్ గా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు…