https://oktelugu.com/

Kanguva: సూర్య కంగువా సినిమాకి ఎన్టీయార్ దేవర రికార్డ్ ను బ్రేక్ చేసే సత్తా ఉందా..?

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటైపోయింది. ఏ భాషలో ఎవరు సినిమా తీసిన కూడా అది మంచి సినిమా అయితే ఇండియాలో ఉన్న ప్రతి ప్రేక్షకుడు ఆ సినిమాను చూసి భారీ సక్సెస్ గా నిలుపుతున్నాడు. అందువల్లే ఒక సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తూనే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ని క్రియేట్ చేసుకుంటున్నారు... ఇక ప్రస్తుతం స్టార్ హీరో రేంజ్ లో ముందుకు దూసుకెళ్తున్న హీరోలు సైతం సక్సెస్ లను సాధించడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉండటం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : October 27, 2024 / 03:34 PM IST

    Kanguva First Review

    Follow us on

    Kanguva: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తమ కంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు సూర్య… ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్న ఈయన కంగువా సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రావడానికి సిద్ధమయ్యాడు. ఇక నవంబర్ 14వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేస్తున్న నేపధ్యం లో ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని భారీ రేంజ్ లో నిర్వహిస్తున్నారు. ఇక తమిళంలో ఈ సినిమా మీద భారీ బజ్ అయితే ఉంది. తెలుగులో మాత్రం అంత పెద్దగా బజ్ క్రియేట్ చేయలేకపోతుంది. కాబట్టి ఇక్కడ కూడా భారీ లెవెల్లో ప్రమోషన్స్ ని చేసి సినిమా మీద ప్రేక్షకుల్లో అటెన్షన్ ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా సూర్య లాంటి స్టార్ హీరో పాన్ ఇండియాలో సినిమా చేస్తుండటం విశేషం… ఇక ఆయనకి ఈ సినిమాతో సక్సెస్ రావడమే కాకుండా మార్కెట్ ను కూడా భారీగా విస్తరింప చేసుకోవాలనే ఉద్దేశ్యంతో ఆయన ముందడుగు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా కంగువా సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందనే దానిమీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.

    ఇక ఇప్పుడు తెలుగులో ఉన్న ప్రతి ప్రేక్షకులు కూడా ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘దేవర’ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి ఈ సినిమా 500 కోట్లకు పైన కలెక్షన్లను రాబట్టింది. ఇక ఇప్పుడు కంగువా సినిమా దేవర సినిమా రికార్డును బ్రేక్ చేస్తూ 600 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టగలుగుతుందా?

    తద్వారా సూర్య జూనియర్ ఎన్టీఆర్ సాధించిన రికార్డును బ్రేక్ చేస్తూ ముందడుగు వేస్తాడా? అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి మొత్తానికైతే సూర్య లాంటి నటుడి సినిమాలను అన్ని భాషల్లోని ప్రేక్షకులు ఆదరిస్తూ ఉంటారు. ఆయన చేసే నటన చాలా జెన్యూన్ గా ఉండటమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడానికి తోడ్పడుతుంది. అందువల్లే ఆయనకు ఇతర భాషల్లో కూడా చాలామంది అభిమానులైతే ఉన్నారు.

    ఇక ఏది ఏమైనా కూడా సూర్య తనదైన రీతిలో ముందుకు సాగుతూ వరుస సక్సెస్ లను సాధిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇప్పుడు ఈ సినిమా విషయంలో కూడా అలాంటి ఒక సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…