https://oktelugu.com/

Game Changer: గేమ్ చేంజర్ టీజర్ నుండి డైలాగ్ లీక్..వింటేజ్ శంకర్ మార్క్..దీపావళి కి అభిమానులు ఏమైపోతారో!

నేడు సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు బ్రాండ్ న్యూ పోస్టర్ తో టీజర్ విడుదల తేదీని ప్రకటించబోతున్నారట. దీపావళి కాకుండా నవంబర్ 4 వ తేదీన టీజర్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఒక నిమిషం 45 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ నిలిచిపోతుందని, సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోతుందని అంటున్నారు మేకర్స్.

Written By:
  • Vicky
  • , Updated On : October 27, 2024 / 03:30 PM IST

    Game Changer Movie

    Follow us on

    Game Changer, game changer movie, game changer shankar movie, Dil Raju: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ కోసం అభిమానులు, ప్రేక్షకులు గత మూడేళ్ళ నుండి ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తారీఖున విడుదల అవ్వబోతున్న ఈ సినిమాకి సంబంధించిన టీజర్ కోసం ఫ్యాన్స్ చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారు. దీపావళి రోజున టీజర్ విడుదల చేయబోతున్నారు అని సోషల్ మీడియా లో ఒక టాక్ వచ్చింది కానీ, మూవీ టీం నుండి మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. దీంతో నేడు అభిమానులు అసలు టీజర్ విడుదల చేస్తారా లేదా?, ఎందుకు ఇంత నిర్లక్ష్యం? అంటూ మూవీ టీం ని ట్యాగ్ చేసి తిట్టడం మొదలు పెట్టారు.

    ఈ విషయం మేకర్స్ వరకు చేరిందో ఏమో తెలియదు కానీ, నేడు సాయంత్రం 5 గంటల 10 నిమిషాలకు బ్రాండ్ న్యూ పోస్టర్ తో టీజర్ విడుదల తేదీని ప్రకటించబోతున్నారట. దీపావళి కాకుండా నవంబర్ 4 వ తేదీన టీజర్ ని విడుదల చేసే ప్లాన్ లో ఉన్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. ఒక నిమిషం 45 సెకండ్ల నిడివి ఉన్న ఈ టీజర్ రామ్ చరణ్ కెరీర్ లోనే ది బెస్ట్ నిలిచిపోతుందని, సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోతుందని అంటున్నారు మేకర్స్. థమన్ గత నెల రోజుల నుండి ఈ టీజర్ కట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, రీ రికార్డింగ్ కోసం పని చేస్తున్నాడు. ఈ టీజర్ లో రామ్ చరణ్ మూడు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తాడట. నాలుగు ఫైట్ షాట్స్ తో పాటుగా ఒక పవర్ ఫుల్ డైలాగ్ కూడా ఉంటుందని తెలుస్తుంది. ‘గేమ్ చేంజర్’ చిత్రం శంకర్ నుండి చాలా కాలం తర్వాత వస్తున్న పూర్తి స్థాయి కమర్షియల్ సినిమా అట. అంటే శివాజీ, ఒకేఒక్కడు రేంజ్ లో ఉంటుంది అన్నమాట.

    తన మార్క్ సోషల్ సందేశం ఇస్తూనే, కమర్షియల్ ఎలిమెంట్స్ ని జోడించి తన వింటేజ్ మార్క్ ని మరోసారి చూపించబోతున్నాడు శంకర్. ఇక పాటలు ఆయన సినిమాల్లో ఎలా ఉంటాయో తెలిసిందే. కేవలం పాటల కోసమే ఆయన నిర్మాతలతో కోట్ల రూపాయిలు ఖర్చు చేయిస్తాడు. అందుకే శంకర్ తో సినిమా అంటే మన టాలీవుడ్ నిర్మాతలు కాస్త భయపడతారు. ఈ సినిమాకి కూడా ఆయన సాంగ్స్ కోసం నిర్మాత దిల్ రాజు తో భారీగానే ఖర్చు చేయించాడు. రీసెంట్ గా విడుదలైన రెండు లిరికల్ వీడియో సాంగ్స్ చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. విజువల్ గా ఈ రెండు పాటలు థియేటర్స్ లో అదిరిపోతాయి అట. త్వరలో విడుదల అవ్వబోయే టీజర్ మీద కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి, మరి ఆ అంచనాలను అందుకుంటుందో లేదో చూడాలి.