https://oktelugu.com/

బాపు బొమ్మకు బాలీవుడ్ ఆఫర్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ లో బాపు బొమ్మగా పరిచయమైన ప్రణీత…ఆ పేరుని ఇపుడు సార్ధకం చేసుకొంటోంది. అందమైన కళ్ళే కాదు, అందమైన హృదయం కూడా ఉందని నిరూపించు కొంటోంది . తానే సొంత ఖర్చు లతో , స్వయంగా వంట చేసి మరీ అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. ఆ క్రమంలో లాక్ డౌన్ మొదలైన తరవాత 21 రోజుల్లోనే ఆమె 75 వేల ఆహార పొట్లాలను అందజేసి […]

Written By:
  • admin
  • , Updated On : May 7, 2020 / 10:18 AM IST
    Follow us on


    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘అత్తారింటికి దారేది’ లో బాపు బొమ్మగా పరిచయమైన ప్రణీత…ఆ పేరుని ఇపుడు సార్ధకం చేసుకొంటోంది. అందమైన కళ్ళే కాదు, అందమైన హృదయం కూడా ఉందని నిరూపించు కొంటోంది . తానే సొంత ఖర్చు లతో , స్వయంగా వంట చేసి మరీ అన్నార్తుల ఆకలి తీరుస్తోంది. ఆ క్రమంలో లాక్ డౌన్ మొదలైన తరవాత 21 రోజుల్లోనే ఆమె 75 వేల ఆహార పొట్లాలను అందజేసి తన గొప్ప మనసు చాటుకొంది .

    ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!

    ఇక ప్రణీత ” కరోనా క్రైసెస్ ఛారిటీ “(C C C) కి అందరు హీరోయిన్స్ కంటే ముందుగా లక్ష రూపాయలను ఇవ్వడం చేసింది .. దీంతో ఎంతో మంది స్టార్ హీరోయిన్ల కన్నా..ప్రణీత బెటర్ అనిపించు కొంది . . డాక్టర్లైన ఆమె తల్లిదండ్రుల కారణంగా ప్రణీతకు సమాజ సేవపై ఆసక్తి మెండు అని తెలుస్తోంది ..

    గతంలో కొన్ని తెలుగు చిత్రాలలో నటించిన ఈ కన్నడ హుడిగి కి ఆశించిన సక్సెస్ రాలేదు . ఇక ఇప్పుడు హిందీలో రెండు సినిమాలు చేస్తోందట ….అందులో ఒకటి అజయ్ దేవగణ్ తో ” భుజ్ ” చిత్రం కాగా రెండోది ప్రియదర్శన్ దర్శకత్వంలో ” హంగామా 2 ” అని .తెలుస్తోంది.