
2000 సంవత్సరం లో `బాచి` చిత్రం తో సంగీత దర్శకుడిగా అరంగేట్రం చేసిన చక్రి చాలా షార్ట్ పిరియడ్ లో స్టార్ మ్యూజిక్ దర్శకుడు అయ్యాడు. పూరి జగన్నాధ్ చిత్రాలైన ” ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం , ఇడియట్ , అమ్మ నాన్న ఓ తమిళ్ అమ్మాయి , శివమణి , దేశముదురు ” వంటి చిత్రాలకు సూపర్ హిట్ మ్యూజిక్ అందించిన చక్రి , తాను సంగీతం అందించిన బయటి చిత్రాల్లో ` చక్రం ` చిత్రంలోని `జగమంత కుటుంబం నాది ` పాట ఎవర్ గ్రీన్ క్లాసిక్ అని చెప్పొచ్చు ఇంకా చెప్పాలంటే .సంగీత దర్శకుడు చక్రి టాలెంట్ గురించి ఇండస్ట్రీలో తెలియని వారు ఉండరు. అలాంటి దర్శకుడు 2014.తన 40 ఏళ్ళ చిరు ప్రాయంలో హఠాన్మరణం చెందాడు.
ఒక్కో ఇంటికి 2లీటర్ల మద్యం డెలివరీ!
ఆ క్రమంలోమణికొండలో నివాసముంటున్న చక్రి అమ్మ , తమ్ముడు లాక్ డౌన్ వేళ పలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో ‘కోవిద సహృదయ ఫౌండేషన్’ సంస్థ వ్యవస్థాపకురాలు అయిన నిర్మాత , డాక్టర్ అనూహ్యారెడ్డి వారిఇంటికి స్వయంగా వెళ్లి రెండు నెలలకు సరిపడా మందులు.. నిత్యావసర వస్తువులు అందజేశారు. అదే సమయంలో తనకు పని ఇప్పించాలన్న చక్రి తమ్ముడు మోహిత్ కోరగా ఆమె కరోనాపై ఓ ట్యూన్ చేయాలని కోరారట…. ఇప్పటికే నాలుగు సినిమాలకు సంగీతం సమకూర్చిన మోహిత్ కి , ఒక సోదరిగా అనూహ్యరెడ్డి ఇచ్చిన భరోసా గొప్ప ఊరట నిచ్చినట్టు తెలుస్తోంది .