Pranitha Subhash: ‘ప్రణీత సుభాష్’ మంచి హీరోయినే. పైగా మంచి మనసు ఉన్న హీరోయిన్ కూడా. ఇక అందంలో అభినయంలో కూడా ప్రణీత సుభాష్ ను తక్కువ చేయలేం. అన్నింటికి మించి ప్రతిభ ఉన్న హీరోయిన్. పైగా బాపు బొమ్మ అంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్. అయితే, అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న మాదిరి తయారైంది ఆమె సినీ కెరీర్.

నిర్మాతల కష్టాలు అర్థం చేసుకునే మనసు ఉన్నా, గొప్ప టాలెంట్ ఉన్నా, కావాల్సినంత గ్లామర్ ఉన్నా.. ఎందుకో హీరోయిన్ గా స్టార్ డమ్ ను సంపాదించలేకపోయింది ప్రణీత సుభాష్. దాంతో ఇక సోలోగా ఉంటే వర్కౌట్ అవ్వదు అనుకుందేమో. కరోనా కాలంలో పెళ్లి కూడా చేసేసుకుంది. అయితే, ప్రణీత సుభాష్ తాజాగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది. సినిమాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కంటిన్యూ చేస్తానంటూ క్లారిటీ ఇచ్చింది.
అదేవిధంగా గతంలో జరిగిన కొన్ని తప్పులు ఈ సారి అసలు జరగకుండా చూసుకుంటాను అంటూ ప్రణీత సుభాష్ చెప్పుకొచ్చింది. మొత్తమ్మీద తనను దర్శకనిర్మాతలు, అలాగే స్టార్ హీరోల పెద్దగా ఆదరించక పోవడానికి కారణాలు వెతుక్కుంది. ఆ వెతుకులాటలో ఆమెకు దొరికిన మెయిన్ పాయింట్ ఒక్కటే అని తెలుస్తోంది.
స్టార్ హీరోయిన్ కి కావాల్సినవి అన్నీ తనలో ఉన్నాయని, కాకపోతే స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే.. ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు మొహమాటం లేకుండా ఉండాలని ప్రణీత సుభాష్ అర్థం చేసుకుంది. మొత్తానికి పెళ్లి అయ్యాక గాని, ప్రణీత సుభాష్ కి తత్వం బోధపడలేదు అన్నమాట. కెరీర్ స్టార్టింగ్ లో ఎక్స్ పోజింగ్ చేయడానికి ప్రణీత ఆసక్తి చూపించలేదు.
Also Read: Bheemla Nayak: బైక్రైడ్ చేస్తూ ‘భీమ్లానాయక్’ వీడియో.. నెట్టింట వైరల్
కానీ, చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం ఏమి ఉంటుంది ? హీరోయిన్ కెరీర్.. పెళ్ళికి ముందు ఒక లెక్క, పెళ్లి తర్వాత మరో లెక్క అన్నట్టు ఉంటుంది. మరి పెళ్లి తర్వాత ప్రణీత సుభాష్ ఇప్పుడు తీరిగ్గా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకుంటే దర్శకులు గుర్తిస్తారా ? ఆమెకు ఛాన్స్ లు ఇస్తారా ? చూడాలి.
Also Read: Hit 2 Movie: అడివి శేష్ బర్త్ డే కానుకగా “హిట్ 2” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్…