https://oktelugu.com/

Pawan Kalyan Fan: అభిమానమంటే ఇంతలా ఉంటుందా.. పెళ్లి పత్రికలో పవన్ కల్యాణ్ ఫొటో ప్రత్యక్షం

Pawan Kalyan Fan: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందట. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పిచ్చి ఉంటుంది. దాన్ని వెల్లడించడంలోనే ప్రత్యేకత చూపుతుంటారు. సందర్భం వచ్చినప్పుడు వారి మనోగతం తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తే ఓ అభిమాని తను అభిమానించే పవన్ కల్యాణ్ అంటే ఓ నమ్మకం. ఆయనను దైవంతో సమానంగా భావిస్తారు. అందుకే ఆయనలో ఉన్న భక్తిని చాటుకునే నేపథ్యం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఏకంగా తన పెళ్లి కార్డులో దేవుడి ఫొటోకు బదులుగా పవన్ కల్యాణ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 18, 2021 / 10:15 AM IST
    Follow us on

    Pawan Kalyan Fan: వేపకాయంత వెర్రి వేయి రకాలుంటుందట. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా పిచ్చి ఉంటుంది. దాన్ని వెల్లడించడంలోనే ప్రత్యేకత చూపుతుంటారు. సందర్భం వచ్చినప్పుడు వారి మనోగతం తెలుస్తోంది. ఇక్కడ మనం చూస్తే ఓ అభిమాని తను అభిమానించే పవన్ కల్యాణ్ అంటే ఓ నమ్మకం. ఆయనను దైవంతో సమానంగా భావిస్తారు. అందుకే ఆయనలో ఉన్న భక్తిని చాటుకునే నేపథ్యం చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. ఏకంగా తన పెళ్లి కార్డులో దేవుడి ఫొటోకు బదులుగా పవన్ కల్యాణ్ ఫొటో ముద్రించి తనలోని భక్తిభావాన్ని చాటాడు.

    Pawan Kalyan Fan

    శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం కేశవరావుపేట గ్రామానికి చెందిన తమ్మినేని శ్రీనివాస్ వవన్ కల్యాణ్ కు అభిమాని. ఎంతంటే ఆయన తన మనసులో పవన్ కల్యాన్ ఫొటోను ముద్రించుకున్నాడు. అందుకే ఏ పని చేసినా అందులో పవన్ కల్యాణ్ ఫొటో ఉండాల్సిందే. అంతటి అభిమానాన్ని పెంచుకున్న శ్రీనివాస్ తన పెళ్లి పత్రికలో కూడా పవన్ కల్యాణ్ ఫొటోలను ముద్రించి తన భక్తిని చాటుకున్నాడు.

    శ్రీనివాస్ కుటుంబంలో అందరూ పవన్ కల్యాణ్ కు వీరాభిమానులే. గతంలో కూడా తన సోదరుడు అప్పలనాయుడు పెళ్లిలో కూడా పవన్ ఫొటోను ముద్రించామని శ్రీనివాస్ చెబుతున్నాడు. అంతేకాదు వాటర్ బాటిల్స్, ఫ్లెక్సీలపై కూడా పవన్ కల్యాణ్ ఫొటోలను ముద్రించాడు. తను తాళి కట్టే సమయంలో పవన్ కల్యాణ్ రాకపోతే ఆయన ఫొటో ఏర్పాటు చేసుకునే విధంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

    Also Read: Bheemla Nayak: బైక్​రైడ్​ చేస్తూ ‘భీమ్లానాయక్’​ వీడియో.. నెట్టింట వైరల్

    శ్రీనివాస్ అభిమానానికి అందరు ఆశ్చర్యపోతున్నారు. తన అభిమాన హీరో కోసం శ్రీనివాస్ చేస్తున్న పనికి అందరు ఫిదా అవుతున్నారు. తనలోని భక్తికి ప్రశంసిస్తున్నారు. అభిమానిస్తే ఇంతలా ఉంటుందా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ శ్రీనివాస్ కోరికను పవన్ కల్యాణ్ తీరుస్తారా? లేక ఎదురు చూసేలా చేస్తారా? అనేది తేలాల్సి ఉంది.

    Also Read: Hit 2 Movie: అడివి శేష్ బర్త్ డే కానుకగా “హిట్ 2” మూవీ ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్…

    Tags