Pushpa: ‘హెల్మెట్​ లేదా పుష్పా?’.. సైబరాబాద్​ పోలీస్​ సరికొత్త మీమ్ నెట్టింట్లో వైరల్​​

Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లుఅర్జున్​ హీరోగా సుకుమార్​ తెరకెక్కించిన సినిమా పుష్ప. నిన్న థియేటర్​లో ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా.. భారీ హిట్​తో దూసుకెళ్లిపోతోంది. ఎక్కడ చూసినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని చోట్ల లాగ్ అనిపించినా.. చివరి నిమిషం వరకు సుకుమార్​ ప్రేక్షకులను థియేటర్​లో కూర్చోబెట్టగలిగాడనే చెప్పాలి. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులతో అభిమానులు సినిమాపై తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రివ్యూలను కూడా ఇచ్చేస్తున్నారు. కాగా, తాజాగా, సైబరాబాద్​ ట్రాఫిక్ పోలీసులు […]

Written By: Raghava Rao Gara, Updated On : December 18, 2021 1:07 pm
Follow us on

Pushpa: స్టైలిస్ట్ స్టార్ అల్లుఅర్జున్​ హీరోగా సుకుమార్​ తెరకెక్కించిన సినిమా పుష్ప. నిన్న థియేటర్​లో ప్రేక్షకులను పలకరించిన ఈ సినిమా.. భారీ హిట్​తో దూసుకెళ్లిపోతోంది. ఎక్కడ చూసినా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కొన్ని చోట్ల లాగ్ అనిపించినా.. చివరి నిమిషం వరకు సుకుమార్​ ప్రేక్షకులను థియేటర్​లో కూర్చోబెట్టగలిగాడనే చెప్పాలి. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులతో అభిమానులు సినిమాపై తమ స్పందన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే రివ్యూలను కూడా ఇచ్చేస్తున్నారు. కాగా, తాజాగా, సైబరాబాద్​ ట్రాఫిక్ పోలీసులు పుష్ప సినిమాపై చేసిన ఓ మీమ్​ ప్రస్తుతం ట్రెండింగ్​గా మారింది.

Pushpa

Also Read: పుష్ప ఓటీటీ స్ట్రీమింగ్​కు​ డేట్​ ఫిక్స్​.. ఎప్పుడో తెలుసా?

ట్విట్టర్​ వేదికగా పోస్ట్ చేసిన ఈ మీమ్​లో అల్లు అర్జున్​, ఫహద్​ ఫాజిల్​ ఫొటోలను కలిపి రూపొందించారు. ఇందులో బన్నీ బైక్​పై కూర్చుని అందరికీ హలో చెబుతున్నట్లుగా ఓ పోస్టర్ విడుదల చేయగా.. అదే ఫొటోను, సినిమాలో ఫహద్​ ఫాజిల్​ చెప్పే పార్టీ లేదా పుష్పా?.. డైలాగ్​ను కలిపి మీమ్​ను క్రియేట్ చేశారు పోలీసులు. ఈ క్రమంలోనే మీమ్​లో హెల్మెట్, మిర్రర్​ లేవా పుష్ప?.. అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్​ నెట్టింట వైరల్​గా మారింది.

ఇటీవల కాలంలో హెల్మెట్​, సైడ్​ మిర్రర్​లు లేకుండా భద్రతా ప్రమాణాలు పాటించని వారిని ఉద్దేశిస్తూ.. ఇటువంటి వినూత్మమైన ఆలోచనతో సైబరాబాద్​ పోలీసులు ప్రజల్లో చైతన్యం కలిగిసంచే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలను కూడా ట్రెండీగా ఉపయోగించుకుంటూ.. అసలు తగ్గేదేలే అంటున్నారు.  కాగా, ఈ సినిమాలో హీరోయిన్​గా రష్మిక నటించిన సంగతి తెలిసిందే. సునిల్​, అనసూయ, రావురమేశ్​లతో పాటు పలువురు కీలక నటులు ఇందులో కనిపించారు.

Also Read: సుక్కు – బన్నీ ‘పుష్ప 2’ను ఏం చేయబోతున్నారు ?