Prakash Raj Shocking Comments On The Kashmir Files Movie: ది కశ్మీర్ ఫైల్స్ చిత్రం సంచలనాలు రేపుతోంది. భారతీయ చిత్రాల రికార్డులను తిరగరాస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి సంచలనాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. రోజురోజుకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దీంతో సినిమాపై అందరు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 90వ దశకంలో జరిగిన కశ్మీరీ పండిట్లపై జరిగతిన దాడిని ఇతివృత్తంగా చేసుకుని దర్శకుడు వివేక్ అగ్నివేష్ అపురూప చిత్రమే ది కశ్మీర్ ఫైల్స్. సినిమాను చూసిన వారంతా దర్శకుడి ప్రతిభను మెచ్చుకుంటున్నారు. సినిమా నిర్మాణంలో అతడు చూపిన తెగువ అందరిని అబ్బురపరుస్తోంది.

అసోం ముఖ్యమంతి విశ్వకర్మ బిశ్వాస్ ప్రభుత్వ ఉద్యోగులకు సగం పూట సెలవు మంజూరు చేసి సినిమా చూడాలని సూచించారు. దీంతో కలెక్షన్ల మోత మోగిస్తోంది. ఇప్పటికే వంద కోట్లు దాటి తానేంటో నిరూపించుకుంటోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఈ సినిమా చూసి పాజిటివ్ ట్వీట్ చేశారు. కానీ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం సినిమాపై విమర్శలు చేయడం దారుణం. సినిమాలో ఏముంది? ఏం సందేశం ఇచ్చారు? కశ్మీరీల్లో ఐక్యతను నాశనం చేసేలా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు.
Also Read: పునీత్, సుశాంత్.. చనిపోయాక హిట్స్ కొట్టిన హీరోలు వీళ్లే
దీంతొ సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రెచ్చిపోయారు. ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలతో విభేదించారు. ఆయనకు సినిమా అర్థం కాలేదన్నట్లు గా పోస్టులు పెడుతున్నారు. ఏది జరిగినా మంచిని చెడుగా చెడును మంచిగా చేసి చూపడంలో ఆయనకు ఆయనే సాటి అంటూ పోస్టులు పోస్టు చేస్తూ శాపనార్థాలు పెడుతున్నారు. మన మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన అతడికి నటుడిగా అవకాశాలు ఇవ్వొద్దంటూ ట్వీట్లు చేస్తున్నారు.

దేశమంతా ఒక వైపు ఉంటే ప్రకాష్ రాజ్ మరో వైపు ఉండటం ఆయన నైజం. అందుకే మా ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారని ప్రేక్షకులు కూడా అతడిపై విరుచుకుపడుతున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ సినిమా అద్భుతంగా తెరకెక్కించిన తీరు ఆయనకు అర్థం కానట్లుగా ఉందని చెబుతున్నారు. ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్లు ఈ సినిమా వ్యవహారం ప్రస్తుతం ప్రకాష్ రాజ్ మెడకు చెట్టుకున్నట్లు అయింది. దీంతో ప్రసార మాధ్యమాల్లో ప్రకాష్ రాజ్ నిజంగానే విలన్ గా అభివర్ణిస్తున్నారు. గాలికి పోయే కంప దేనికో తగిలించుకోవడం అంటే ఇదేనేమో.
Also Read: పవన్ కు బీజేపీ నో పర్మిషన్.. టెన్షన్ లో టీడీపీ, వైసీపీ?