Bheemla Nayak Movie: ‘భీమ్లానాయక్’ మూవీలో పవన్ కళ్యాణ్ విశ్వరూపానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ కు ఒక రాజకీయ పలుకుబడి గల వ్యక్తికి మధ్య జరిగిన యుద్ధాన్ని చాలా బాగా హైలెట్ చేసి చూపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొట్టింది.

ఇక సినిమా మంచి పేరు రావడంతో దీన్ని తెలంగాణలో పోలీసుల కోసం కూడా ఒక ప్రత్యేక షోను ఇదివరకూ వేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పోలీస్ శాఖలోని మహిళా పోలీస్ అధికారుల కోసం హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ స్పెషల్ షోను ప్రదర్శింపచేశారు. హైదరాబాద్ జీవీకే మాల్ లో ఈ స్పెషల్ షో కోసం సిటీ కమిషనర్ ఏకంగా 1200 టికెట్స్ ను కొనుగోలు చేశారు. ఇప్పుడు రాజమండ్రిలో వికలాంగుల కోసం కూడా ఒక ఉచిత షోను వేసి చిత్రం యూనిట్ ఆదర్శంగా నిలిచింది.
Also Read: టీఆర్ఎస్ ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు బీభత్సం.. ఒకరిని చంపి.. ముగ్గురిని గాయపరిచినా చర్యల్లేవా?
తాజాగా రాజమండ్రిలోని ‘వీఎల్సీ సినిమాస్’ థియేటర్ మాల్ లో వికలాంగుల కోసం ఒక ప్రత్యేకమైన ‘భీమ్లానాయక్’ షోను వేశారు. దీన్ని పూర్తి ఉచితంగా ప్రేక్షకులకు చూపించారు.

తమ అభిమాన పవన్ కళ్యాణ్ ను చూడడంతో ఆ వికలాంగులంతా ఉబ్బితబ్బిబయ్యారు. తన అంగవైకల్యంతో అసలు థియేటర్లకు వచ్చే పరిస్థితియే లేదని.. కానీ తమకు సినిమా చూపించిన నిర్వాహకులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
మలయాళ చిత్రం ‘అయ్యప్పమ్ కోషియమ్’ ఆధారంగా తెలుగులో ఈ సినిమా రిమేక్ అయ్యింది. వందకోట్లకు పైగా ఈ సినిమా గ్రాస్ వసూళ్లను సాధించిందింది. పవన్ కళ్యాణ్, రానా ఈ సినిమాలో పోటీపోటీగా నటించారు.
Also Read: పవన్ కు బీజేపీ నో పర్మిషన్.. టెన్షన్ లో టీడీపీ, వైసీపీ?