వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో ప్రకాష్ రాజ్ మీడియాతో తన అనుభవాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా పవన్ తో తన సినీ ప్రయాణాన్ని చెప్పుకొచ్చారు. పవన్ వ్యక్తిత్వం గురించి మాట్లాడారు.
‘కెరీర్ ప్రారంభంలో సుస్వాగతం సినిమాతో పవన్, నేను కలిసి నటించామని.. ఇప్పటికీ వకీల్ సాబ్ 5వ సినిమా అని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. అప్పటికీ ఇప్పటికీ పవన్ కళ్యాణ్ వేరు అని.. మారిపోయాడని ప్రకాష్ రాజ్ తెలిపాడు. పవన్ లో చాలా మార్పు వచ్చిందన్నాడు.
సినిమా హీరోగా వచ్చిన కొత్తలో పవన్ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు.. చాలా సిగ్గు పడేవారు. నటించడం మాత్రమే మన పని అనుకునేవారు. కానీ ఇేప్పుడు పవన్ లో చాలా మార్పు వచ్చింది.. చాలా క్రేజ్ ఏర్పడిందని ప్రకాష్ తెలిపారు.
వ్యక్తిగా.. నటుడిగా పవన్ ఎంతో ఎదిగారని.. పవన్ లో ఇంకా ఆ సిగ్గు మాత్రం అలానే ఉందని ప్రకాష్ రాజ్ తెలిపారు. పవన్ ను తాను ఎప్పుడూ ఇష్టపడుతానని.. అనుకున్నది సాధించేశాం అని కాకుండా ప్రజలకు ఏదో చేయాలని ఆరాటపడుతుంటాడు పవన్ అని కొనియాడారు. సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తి పవన్ అని ప్రశంసించారు.