కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ శుభవార్త..?

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం అనేక నిబంధనలలో మార్పులు చేసింది. డీఏ , డీఆర్ యొక్క ప్రయోజనాల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న తరుణంలో ఉద్యోగుల నైట్ డ్యూటీ అలవెన్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. 7 వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం నైట్ డ్యూటీ అలవెన్స్ గురించి మార్గదర్శకాలు జారీ […]

Written By: Kusuma Aggunna, Updated On : April 17, 2021 1:23 pm
Follow us on

కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా ప్రభుత్వం అనేక నిబంధనలలో మార్పులు చేసింది. డీఏ , డీఆర్ యొక్క ప్రయోజనాల కోసం ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురు చూస్తున్న తరుణంలో ఉద్యోగుల నైట్ డ్యూటీ అలవెన్స్ పై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.

7 వ వేతన సంఘం సిఫారసుల ప్రకారం నైట్ డ్యూటీ అలవెన్స్ గురించి మార్గదర్శకాలు జారీ కానున్నాయి. కేంద్రం . కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నైట్ డ్యూటీపై ప్రత్యేక అలవెన్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేక గ్రేడ్ పే ఆధారంగా ఉద్యోగులకు నైట్ డ్యూటీ ఆలవెన్స్ లభించనుందని సమచారం. నైట్ ఆలనెస్ ఇవ్వడం వల్ల ఉద్యోగులకు ప్రయోజనం చేకూరడంతో పాటు చేతికి అందే జీతం పెరిగే అవకాశం ఉంది.

నూతన నిబంధనల డ్యూటీ సమయంలో ప్రతి గంటకు 10 నిమిషాల వెయిటేజీ ఉంటుంది. నైట్ డ్యూటీ అలవెన్స్ కు బేసిక్ పే కేంద్రం 43,600 రూపాయలు వేతనంగా నిర్ణయించింది. గంటల లెక్కన నైట్ డ్యూటీ అలవెన్స్ చెల్లింపు జరుగుతుందని తెలుస్తోంది. ప్రాథమిక వేతనం, డీఏ ఏడవ వేతన సంఘం ఆధారంగా లెక్కించడం జరుగుతుంది. రాత్రి డ్యూటీ చేసే ఉద్యోగులకు మాత్రమే నైట్ డ్యూటీ ఆలవెన్స్ లభిస్తుంది.

కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా తీసుకుంటున్న నిర్ణయాలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.