https://oktelugu.com/

టీకా ఫెయిల్: చావుబతుకుల మధ్య ప్రముఖ నటుడు

తమిళనాట ప్రముఖ నటుడు.. తెలుగు వారికి కూడా సుపరిచితమైన వివేక్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తీసే ప్రతిసినిమాలోనూ నటుడు వివేక్ కీలక పాత్రలు పోషిస్తుంటాడు. శివాజీలో రజినీ స్నేహితుడి పాత్రలో నటించాడు. ఇక బాయ్స్ లో నలుగురు కుర్రాళ్లకు అండగా నిలచే మేనేజర్ గా కనిపించాడు. అలాంటి నటుడు తాజాగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఆందోళనకు గురిచేసింది. వివేక్ వ్యాక్సిన్ తీసుకున్న […]

Written By:
  • NARESH
  • , Updated On : April 16, 2021 / 09:01 PM IST
    Follow us on

    తమిళనాట ప్రముఖ నటుడు.. తెలుగు వారికి కూడా సుపరిచితమైన వివేక్ చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ తీసే ప్రతిసినిమాలోనూ నటుడు వివేక్ కీలక పాత్రలు పోషిస్తుంటాడు.

    శివాజీలో రజినీ స్నేహితుడి పాత్రలో నటించాడు. ఇక బాయ్స్ లో నలుగురు కుర్రాళ్లకు అండగా నిలచే మేనేజర్ గా కనిపించాడు. అలాంటి నటుడు తాజాగా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే తీవ్ర అనారోగ్యానికి గురికావడం ఆందోళనకు గురిచేసింది.

    వివేక్ వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని గంటల్లోనే అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. వెంటనే ఆయనను ఉదయం 11 గంటలకు ఆస్పత్రికి తరలించారు.

    కోమాలోకి వెళ్లిన వివేక్ కు యాంజియోగ్రామ్, యాంజియో ప్లాస్టీ నిర్వహించి ఐసీయూలో పెట్టారు.ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదో ప్రత్యేకమైన గుండెపోటు వచ్చిందని నిర్దారించారు.

    అయితే కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల గుండెపోటు వచ్చిందా? లేక సాధారణంగానే ఆందోళనతో వచ్చిందా? అన్నది తేలాల్సి ఉందని వైద్యులు చెబుతున్నారు.

    వివేక్ ఆరోగ్య పరిస్థితి 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీయూలో కృత్రిమ శ్వాస సాధానాలతో వివేక్ చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు.