Homeఎంటర్టైన్మెంట్prakash raj: వారం రోజులు ప్రకాశ్​ రాజ్​ మౌనవ్రతం.. ఎందుకో తెలుసా?

prakash raj: వారం రోజులు ప్రకాశ్​ రాజ్​ మౌనవ్రతం.. ఎందుకో తెలుసా?

prakash raj: ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్​ రాజ్​ వారం రోజుల పాటు మౌనవ్రతం చేయబోతున్నారు. ఆయన ఎవరిమీదో నిరసనతో ఈ వ్రతం చేయట్లేదండోయ్​.. ఇటీవల కాలంతో అనారోగ్యానికి గురైన ప్రకాశ్​రాజ్​.. ఎందుకైనా మంచిదని ఆసుపత్రికి వళ్లి బాడీ చెక్​అప్​ చేయించుకున్నారట. అయితే, ఆరోగ్యం అంతా బాగుందని.. ఒక్క ఓకల్​ కార్డ్స్​ మాత్రం కాస్త దెబ్బతిన్నాయని.. వారం పాటు పూర్తి స్థాయిలో విశ్రాంతి ఇస్తే అదే నయమవుతుందని వైద్యులు సూచించారు. దీంతో మౌనవ్రతానికి పూనుకున్నారు ప్రకాశ్​రాజ్. ఈ విషయాన్ని ప్రకాశ్​ రాజ్​ ట్విట్టర్​ వేదికగా స్వయంగా తెలియజేశారు.

ప్రతి విషయంలో సూటిగా తన అభిప్రాయాన్ని తెలయజేస్తుంటారు ప్రకాశ్​ రాజ్.. అలాంటి వ్యక్తి ఇప్పుడు మౌన వ్రతం చేయడం విశేషాన్ని సంతరించుకుంది. అయితే, ఆయన మౌనం కొంతమందికి వరంగా మారుతుందని సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. దీంతో పాటు, ఆయన ఆరోగ్యం కూడా త్వరగా మెరుగవుతుందని అంటున్నారు. ఇటీవల అమెజాన్​ ప్రైమ్​ వేదికగా విడుదలైన జై భీమ్​ సినిమాలో ప్రకాశ్​రాజ్​ నటించిన సంగతి తెలిసిందే. అయితే, తన పాత్రకు ఎప్పుడూ ఆయనే డబ్బింగ్ చెప్పుకునే వారు. కానీ, ఈ సినిమాలో వేరొకరి వాయిస్ వినిపించింది. ఈ క్రమంలోనే ఆ సినిమా షూటింగ్​ సమయం నుంచే ఆయనకు ఈ సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది.

కాగా, ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి ఎంతో మంది ప్రశంసలతో పాటు, విమర్శలూ ఎదుర్కొంటోంది. ఈ సినిమాలో కొన్ని సీన్​లు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ పలు కేసులు కూడా నమోదయ్యాయి. కాగా, మరోవైపు వాస్తవ ఘటనలను కళ్లకు కట్టినట్లు చూపించారని.. పలువురు సెలబ్రిటీలతో పాటు, రాజకీయ నాయకులూ ప్రశంసించారు. ఇప్పటికీ ఈ సినిమా వివాదం కొనసాగుతూనే ఉంది.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version