Sampoornesh Babu: “మిస్టర్ బెగ్గర్” గా రానున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు…

Sampoornesh Babu: హృదయ కాలేయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. డిఫరెంట్ కామెడీ సినిమాలతో కొత్త ట్రెండ్ సృష్టించి తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సంపూకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది అని చెప్పాలి. ఆ తర్వాత సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఈ హీరో. ఒక పక్క హీరోగా కామెడీ సినిమాలు చేస్తూ మరో పక్క వేరే సినిమాల్లో […]

Written By: Raghava Rao Gara, Updated On : November 16, 2021 11:07 am
Follow us on

Sampoornesh Babu: హృదయ కాలేయం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంట్రీ ఇచ్చాడు బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు. డిఫరెంట్ కామెడీ సినిమాలతో కొత్త ట్రెండ్ సృష్టించి తనకంటూ ప్రత్యేక స్థానం కల్పించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. సంపూకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది అని చెప్పాలి. ఆ తర్వాత సింగం 123, కొబ్బరిమట్ట చిత్రాలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఈ హీరో. ఒక పక్క హీరోగా కామెడీ సినిమాలు చేస్తూ మరో పక్క వేరే సినిమాల్లో గెస్ట్ రోల్స్, కమెడియన్ రోల్స్ చేస్తూ అలరిస్తున్నాడు. అప్పుడప్పుడు టీవీ కార్యక్రమాల్లోనూ అలరిస్తున్నాడు.

త్వరలో సంపూ నటించిన ‘క్యాలీఫ్లవర్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ తరుణంలోనే తాజాగా మరో కొత్త సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు సంపూ. కాగా సంపూర్ణేష్ బాబు సినిమాలతో పాటు సినిమా టైటిల్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి. తాజాగా మరో విభిన్నమైన టైటిల్ తో సంపూ రాబోతున్నాడు. ఈ కొత్త సినిమా టైటిల్ ‘మిస్టర్ బెగ్గర్’ అని ఖరారు చేశారు. ఈ చిత్రంలో సంపూర్ణేష్‌బాబు సరసన అద్వితిశెట్టిలు హీరోయిన్ గా నటిస్తుంది. అలానే వడ్ల జనార్ధన్‌ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ విలన్ సత్యప్రకాష్‌ క్లాప్‌ కొట్టారు. గోవా బ్యాక్‌డ్రాప్‌లో సాగే వినోదాత్మక చిత్రమిది అని సంపూర్ణేష్‌ బాబు అన్నారు. ఓ బిచ్చగాడి జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలని కామెడీ రూపంలో తెరకెక్కించబోతున్నాము సంపూ వెల్లడించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.