spot_img
Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu- Prakash Raj: మహేష్ మూవీకి సమస్యగా మారిన ప్రకాష్ రాజ్!

Mahesh Babu- Prakash Raj: మహేష్ మూవీకి సమస్యగా మారిన ప్రకాష్ రాజ్!

Mahesh Babu- Prakash Raj: మహేష్ బాబు 28వ చిత్రం గుంటూరు కారం. ప్రారంభం నుండే అనుకున్న ప్రకారం షూటింగ్ జరగడం లేదు. సెట్స్ పైకి వెళ్లేందుకే ఆలస్యమైంది. ఒక షెడ్యూల్ మొదలయ్యాక మధ్యలో ఆగిపోయింది. స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి ఫ్రెష్ గా స్టార్ట్ చేశారని తెలిసింది. అలాగే మహేష్-త్రివిక్రమ్ మధ్య మనస్పర్థలు తలెత్తాయనే వాదన వినిపించింది. అందుకే మహేష్ షూటింగ్ మధ్యలో వదిలేసి విదేశీ టూర్ కి వెళ్లారని అన్నారు. ఈ వార్తలను చిత్ర యూనిట్ ఖండించింది. దాదాపు రెండు నెలలుగా గుంటూరు కారం షూటింగ్ బ్రేక్ పడింది.

నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 7 నుండి అనుకున్నారు. అది కూడా వెనక్కిపోయిందట. ఫ్రెష్ గా జూన్ 10న స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ముందుగా అనుకున్న డేట్స్ అన్నీ మారిపోయాయి. క్యాన్సిల్ చేసి నటుల వద్ద కొత్త డేట్స్ తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మిగతా నటులతో ఎలాంటి సమస్య లేదు. కానీ ప్రకాష్ రాజ్ విషయంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఆయన ఇచ్చిన డేట్స్ లో షూటింగ్ జరగలేదు. ఎప్పుడు కొత్త డేట్స్ అంటే ప్రకాష్ రాజ్ కి సమస్యగా మారిందట. ఆయనకున్న కమిట్మెంట్స్ రీత్యా మహేష్ మూవీకి రివైజ్ చేసిన డేట్స్ ఇచ్చే పరిస్థితి లేదంటున్నారు.

మరోవైపు మహేష్ బాబు చిత్ర షూటింగ్ అక్టోబర్ చివరికల్లా పూర్తి చేయాలని కండీషన్ పెట్టారట. అందుకు నిరవధికంగా షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. మరి ప్రకాష్ రాజ్ కి మహేష్ పెట్టిన కండిషన్స్ ప్రకారం డేట్స్ ఇవ్వడం కుదురుతుందా? లేదా? అనే సందిగ్ధత కొనసాగుతుంది. ఇక కృష్ణ జయంతి సందర్భంగా మే 31న గుంటూరు కారం ఫస్ట్ గ్లిమ్ప్స్ విడుదల చేశారు. మహేష్ బాబు ఊరమాస్ అవతార్ ఆకట్టుకుంది. వాచ్ ఏడాది సంక్రాంతి కానుకగా గుంటూరు కారం విడుదల కానుంది.

దాదాపు పదమూడేళ్ళ అనంతరం మహేష్-త్రివిక్రమ్ కాంబోలో మూవీ తెరకెక్కుతుంది. అతడు ఖలేజా చిత్రాల అనంతరం గుంటూరు కారం చేస్తున్నారు. పూజా హెగ్డే మహేష్ కి జంటగా నటిస్తుంది. గతంలో వీరిద్దరూ మహర్షి చిత్రం చేశారు. త్రివిక్రమ్ తో పూజా హెగ్డేకి వరుసగా మూడో చిత్రం ఇది. శ్రీలీల మరొక హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్లో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....

AP MLC Elections: ఎమ్మెల్సీలుగా ఆ ఇద్దరు నేతలను ఫిక్స్ చేసిన చంద్రబాబు!

AP MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక కసరత్తు ప్రారంభం అయింది. గవర్నర్ కోటా కింద ఎంపికైన జాకీయా ఖానం, పండుల రవీంద్రబాబు ఈనెల 28న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో...

Roja: తీవ్ర నిర్ణయం దిశగా రోజా!

Roja: ఇటీవల మాజీ మంత్రి రోజా పెద్దగా కనిపించడం లేదు. రాజకీయంగా యాక్టివ్ గా లేరు. పార్టీ కార్యాలయం నుంచి వచ్చే కంటెంట్ తో సోషల్ మీడియాలో పెట్టే ట్విట్లకు పరిమితం అవుతున్నారు....

Ravi Teja: రవితేజ ఇరుముడి తో కంబ్యాక్ ఇస్తున్నాడా…

Ravi Teja: మాస్ మహారాజా రవితేజ ఇంతకుముందు చేసిన సినిమాలతో భారీ డిజాస్టర్లను మూటగట్టుకున్నాడు. హీరోలు చేసే సినిమాలు ప్రేక్షకులను అలరించే విధంగా ఉండాలి. కానీ ప్రేక్షకులను ఇబ్బంది పెట్టే సినిమాల...

AI Farming Technology: మందులు కాదు.. ఇకపై పంటలు పండాలంటే ఈ కెమెరాలే కావాలి..

AI Farming Technology: భూమిలో సారం మెరుగ్గా ఉంటే పంటలు అద్భుతంగా పండుతాయి. ఇది ఒకప్పుడు.. ఇప్పుడు భూమిలో సారం ఉన్నప్పటికీ పంటలు సరిగ్గా పడడం లేదు. దీని కారణం వాతావరణంలో మార్పులు....
Oktelugu Epaper
Exit mobile version