Site icon OkTelugu

Mahesh Babu: మహేష్ బాబు అభిమానులకు చేదు వార్త.. ఊరించి దెబ్బ తీశారుగా..

Mahesh Babu

Mahesh Babu

Mahesh Babu: ప్రతీ ఏడాది మహేష్ బాబు అభిమానులు , తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలను ఎంత గ్రాండ్ గా జరిపిస్తారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా బ్యానర్లు , సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా, మహేష్ బాబు కెరీర్ లో సూపర్ హిట్ గా నిల్చిన చిత్రాలను రీ ఎడిట్ చేసి గ్రాండ్ గా రీ రిలీజ్ చేస్తుంటారు. అలా ఆయన్ని సూపర్ స్టార్ గా నిలబెట్టిన ‘పోకిరి’ సినిమాని వచ్చే నెల 9న గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యాలని అనుకున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి అయ్యాయి. అయితే ఇప్పుడు ఆ ఆలోచన ని విరమించుకున్నట్టు కాసేపటి క్రితమే టీం అధికారికంగా ప్రకటించింది. దీంతో మహేష్ ఫ్యాన్స్ తీవ్రమైన నిరాశకు గురయ్యారు. ఊరించి మరీ దెబ్బ తీసినందుకు టీం పై మండిపడుతూ ట్వీట్లు వేస్తున్నారు.

ఇంతకు ఈ చిత్రాన్ని వాయిదా వేయడానికి గల ముఖ్య కారణం, ఆగష్టు మొదటి వారం లో అనేక కొత్త సినిమాలు విడుదల అవ్వబోతుండడం వల్లే. అలాంటి సమయం లో భారీ విడుదల అసాధ్యం. ఈ సినిమాతో రీ రిలీజ్ ట్రెండ్ లో సరికొత్త బెంచ్ మార్కు ని క్రియేట్ చెయ్యాలని అనుకుంటున్నామని , అందుకు ఒక వారం రోజుల పాటు ఫ్రీ గ్రౌండ్ ఉండాలి కాబట్టి , ఈ చిత్రాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు చెప్పుకొచ్చింది మహేష్ టీం. దీంతో వచ్చే నెల 9 న థియేటర్స్ లో పండుగ చేసుకోవాలని భావించిన మహేష్ ఫ్యాన్స్ కి తీవ్రమైన నిరాశే మిగిలింది. ఇప్పుడు ‘పోకిరి’ రావడం లేదు కాబట్టి , ఈ సినిమా స్థానంలో ఏ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారో అని సోషల్ మీడియా లో మహేష్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. అసలు ఈ ఏడాది మహేష్ పుట్టిన రోజున రీ రిలీజ్ ఉంటుందా లేదా ? అనే అనుమానంతో ఉన్నారు ఫ్యాన్స్.

మరోపక్క ప్రస్తుతం మహేష్ బాబు చేస్తున్న ‘వారణాసి’ చిత్రం నుండి ఏదైనా అప్డేట్ రాబోతోందా లేదా అనే విషయం పైన కూడా స్పష్టత లేదు. మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక టీజర్ ని ప్లాన్ చేస్తున్నారంటూ గత కొంతకాలం నుండి సోషల్ మీడియా లో ప్రచారం జరిగింది. దీనిపై ఇప్పటి వరకు ‘వారణాసి’ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ వారణాసి నుండి కూడా ఎలాంటి అప్డేట్ రాకపోతే , మహేష్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది ఒక చేదు జ్ఞాపకం లాగానే మిగిలిపోతుందని చెప్పొచ్చు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

Exit mobile version