Vishwambhara vs Coolie: సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలా సినిమాల మధ్య పోటీ అనేది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది. ఇక చిరంజీవి రజినీకాంత్ సినిమాల మధ్య మొదటి నుంచి కూడా మంచి పోటీ అయితే ఉంది. ఇక అందులో భాగంగానే ఇప్పుడు విశ్వంభర, కూలీ సినిమాల మధ్య మంచి పోటీ అయితే ఉంది. అయితే ఈ రెండు సినిమాలు సక్సెస్ కొడతాయా లేదంటే వీటిలో పై చేయి సాధించే సినిమా ఏది అనేది ఇద్దరు అభిమానుల మధ్య చాలా ఉత్కంఠను రేపుతుంది.
ఇక ఇదిలా ఉంటే విశ్వంభర సినిమా నుంచి ఇప్పటివరకు ఒక గ్లింప్స్ కూడా బయటికి రాలేదు. కానీ ‘ కూలీ’ సినిమా నుంచి రీసెంట్ గా ఒక గ్లింప్స్ అయితే వచ్చింది. ఇక ఆ గ్లింప్స్ అయితే అదిరిపోయేలా ఉంది. తమిళ్ ప్రేక్షకులతో పాటు, గ్లింప్స్ తెలుగులో ఉన్న ప్రతి ప్రేక్షకుడిని కూడా అలరించిందనే చెప్పాలి. విశ్వంభర సినిమా నుంచి గ్లింప్స్ వస్తే గానీ ఆ సినిమా ఎలా ఉండబోతుంది అనేది తెలియదు. ఇక వీళ్ళిద్దరి సినిమాల మధ్య టఫ్ వార్ ఉన్నప్పటికీ ఎవరు పై చేయి సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది. ఇక చిరంజీవి గత సినిమా అయిన భోళా శంకర్ సినిమా రజినీకాంత్ జైలర్ సినిమా ఒక్కరోజు గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి.
ఇక అందులో జైలర్ అద్భుతమైన విజయాన్ని సాధిస్తే భోళా శంకర్ డిజాస్టర్ గా మిగిలింది. మరి ఈసారి చిరంజీవి పై చేయి సాధించి రజనీకాంత్ ను ఓడిస్తాడా ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా మంచి విజయాన్ని సాధిస్తుంది రెండు సినిమాలు కూడా ప్రేక్షకుల్ని అలరిస్తాయా అనే విషయాలైతే తెలియాల్సి ఉంది. ఇక రజినీకాంత్ కూడా ఈ ఏజ్ లో తన స్టామినాని చూపిస్తూ సినిమా చేయడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి…
ఇక రెండు సినిమాల కంటెంట్ కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక లోకేష్ కనకరాజ్ మాఫియా స్టోరీలను బాగా హ్యాండిల్ చేయగలిగే కెపాసిటీ ఉన్న డైరెక్టర్…వశిష్ఠ గ్రాఫికల్ సినిమాలను బాగా హ్యాండిల్ చేసే సత్తా ఉన్న వ్యక్తి కావడం విశేషం… మరియు రెండు సినిమాలు కూడా వేరువేరు జానర్లలో వస్తున్నప్పటికీ ఎవరిది పై చేయి సాధిస్తుంది అనేది మాత్రం ఇక్కడ కీలకమైన అంశంగా మారింది…