Pradeep Ranganathan: తమిళనాడు యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న హీరోలలో ఒకరు ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan). ఇతను షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఒకప్పుడు బాగా ఫేమస్ అయ్యాడు. ఆ తర్వాత ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి తమిళ హీరో జయం రవి తో ‘కోమలి’ అనే చిత్రం చేసాడు. ఇది కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకొని, ఆయన స్వీయ దర్శకత్వం లో హీరోగా చేస్తూ ‘లవ్ టుడే’ అనే చిత్రం చేసాడు. ఈ సినిమా అటు తమిళం లోనూ, ఇటు తెలుగు లోనూ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ప్రేమికులు ఒకరికొకరు మొబైల్ ఫోన్స్ మార్చుకుంటే ఎలాంటి పరిస్థితులు వస్తాయి అనే అంశం తో తెరకెక్కిన ఈ సినిమాకు 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఈ చిత్రం తర్వాత విడుదలైన ‘డ్రాగన్’ కి కూడా 150 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది.
ఈ ఏడాది తమిళనాడు అత్యధిక గ్రాస్ వసూళ్లను రాబట్టిన చిత్రాల్లో ఒకటి ‘డ్రాగన్’. చాలా మంది స్టార్ హీరోలకు కూడా ఈ రేంజ్ వసూళ్లు తమిళనాడు ప్రాంతం లో రాలేదు అంటే అతిశయోక్తి కాదేమో. తప్పుడు మార్గం లో ఉద్యోగం సంపాదించి ఉన్నత స్థాయికి వెళ్లిన ఒక బీటెక్ కుర్రాడు, అది తప్పని తెలుసుకొని మళ్ళీ తన జీవితాన్ని నిజాయితీగా ఎలా మొదలు పెట్టాడు అనే కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం యూత్ ఆడియన్స్ ని విపరీతముగా ఆకర్షించింది. ఇలా వరుసగా యూత్ ఆడియన్స్ వెర్రెక్కిపోయే సినిమాలు చేసిన ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘డ్యూడ్'(Dude Movie) అనే చిత్రం చేస్తున్నాడు. ఇది కూడా ఒక యూత్ ఫుల్ ఎంటర్టైనర్ అని నేడు విడుదల చేసిన పోస్టర్ తో అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది.
ఈ చిత్రానికి కీర్తి స్వరణ్ దర్శకత్వం వహిస్తుండగా, సాయి అభయంకర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రైవేట్ ఆల్బమ్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకున్న సాయి అభయంకర్ రీసెంట్ గా మొదలైన అల్లు అర్జున్, అట్లీ మూవీ కి కూడా సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం లో హీరోయిన్ గా ‘ప్రేమలు’ బ్యూటీ మమిత బైజు నటిస్తుంది. తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ ఏడాది దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఈ సినిమా కూడా హిట్ అయితే ఇక ప్రదీప్ రంగనాథన్ తమిళనాడు యూత్ ఆడియన్స్ కి ఐకాన్ గా మారిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తమిళ హీరో విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఆయన స్థానం ఇప్పుడు ఖాళీ అయ్యింది. ప్రదీప్ రంగనాథన్ ఇదే తరహా సినిమాలు చేస్తూ పోతే కచ్చితంగా విజయ్ స్థానాన్ని రీ ప్లేస్ చేయొచ్చు.