Hit 3 Movie Collection: నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) నటించిన లేటెస్ట్ చిత్రం ‘హిట్ 3′(Hit : The Third Case) భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ ని తెచ్చుకొని, కేవలం ఆరు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకున్న సంగతి మన అందరికీ తెలిసిందే. నాని కి ఇది మూడవ వంద కోట్ల గ్రాస్ సినిమా అనొచ్చు. అయితే ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమా అయినా కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేవు. #RRR లాంటి సినిమాలకే తప్పలేదు, ఇక ఈ సినిమా ఎంత చెప్పండి. అలా ఈ చిత్రం కూడా బ్రేక్ ఈవెన్ కి ఆమడదూరం లో ఉన్నటువంటి సెంటర్ సీడెడ్. ఇక్కడ మాత్రం ఈ చిత్రానికి నష్టాలు తప్పేలా కనిపించడం లేదు. అక్కడ ఈ చిత్రానికి విడుదలకు ముందు 5 కోట్ల 40 లక్షల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
Also Read: ఏపీ మాజీ మంత్రి విడుదల రజిని పీఏ అరెస్ట్.. కారణం ఏంటంటే..
9 రోజుల్లో వచ్చిన వసూళ్లు కేవలం 4 కోట్ల 62 లక్షలు మాత్రమే. ఫుల్ రన్ లో 5 కోట్ల వసూళ్లను రాబట్టడం కూడా కష్టం లాగానే అనిపిస్తుంది. కాబట్టి ఈ ప్రాంతం లో నష్టాలు తప్పవు. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే నైజాం లో ఈ చిత్రం దుమ్ము లేపేసింది అనొచ్చు. 9 రోజుల్లో దాదాపుగా 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బయ్యర్స్ కి ఈ ప్రాంతం లో మూడు కోట్ల రూపాయిలు లాభాలు. నేడు, రేపటితో ఈ చిత్రం 20 కోట్ల షేర్ కి దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది. ఓవరాల్ గా 9 రోజుల్లో ఈ చిత్రానికి ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ కలిపి 35 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. నేడు శనివారం కావడం తో బుక్ మై షో లో ఈ చిత్రానికి గంటకు మూడు వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి.
మొదటి 9 రోజులు నాన్ స్టాప్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల నుండి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. ఈరోజు, రేపు చెరో రెండు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఓవర్సీస్ లో రీసెంట్ గానే 12 కోట్ల రూపాయిల షేర్ మార్కుని అందుకుంది. ఇక కర్ణాటక లో అయితే ఏకంగా 6 కోట్ల 30 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 56 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 105 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Also Read: అప్పుడే డైరెక్షన్ చేస్తా.. వెన్నెల కిషోర్ షాకింగ్ కామెంట్స్..