https://oktelugu.com/

Dragon Movie : యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ‘డ్రాగన్’ ఓటీటీ విడుదల తేదీ ఖరారు..ఎందులో చూడాలంటే!

Dragon Movie : తెలుగు లో కూడా ఈ సినిమా మొదటి వారం లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోని క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా హీరో ప్రదీప్ రంగనాథన్ కి యూత్ ఆడియన్స్ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదికి సంబంధించిన లేటెస్ట్ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Written By: , Updated On : February 28, 2025 / 09:34 PM IST
Dragon Movie

Dragon Movie

Follow us on

Dragon Movie : ‘లవ్ టుడే’ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) నటించిన లేటెస్ట్ చిత్రం ‘డ్రాగన్'(Dragon Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బ్లాక్ బస్టర్ స్టేటస్ ని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా 80 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలన సృష్టించింది. యూత్ ఆడియన్స్ విపరీతంగా థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తున్న ఈ మూవీ ఫుల్ రన్ లో కచ్చితంగా 150 కోట్ల రూపాయిలు రాబడుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. తెలుగు లో కూడా ఈ సినిమా మొదటి వారం లోపే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోని క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా హీరో ప్రదీప్ రంగనాథన్ కి యూత్ ఆడియన్స్ ఈ సినిమాతో బాగా కనెక్ట్ అయిపోయారు. అయితే ఈ సినిమా ఓటీటీ విడుదల తేదికి సంబంధించిన లేటెస్ట్ వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

Also Read : ‘డ్రాగన్’ మూవీ ని తెలుగులో మిస్ చేసుకున్న యంగ్ హీరో అతనేనా..? దురదృష్టం మామూలు రేంజ్ లో లేదుగా!

ఈ సినిమా డిజిటల్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్(Netflix Movie) సంస్థ భారీ రేట్ కి కొనుగోలు చేసింది. గతంలో ‘లవ్ టుడే’ చిత్రం కూడా నెట్ ఫ్లిక్స్ సంస్థ కొనుగోలు చేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి భారీ రెస్పాన్స్ రావడంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ ఈ సినిమాని ఫ్యాన్సీ రేట్ కి కొనుగోలు చేసింది. అయితే కుదిరించుకున్న ఒప్పందం ప్రకారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని మార్చి 28 న విడుదల చేయాలి. కానీ థియేట్రికల్ రన్ మరో రెండు వారాలు వచ్చే అవకాశం ఉండడంతో విడుదల తేదీని పొడిగించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ రెండు వారాల తర్వాత పూర్తిగా థియేట్రికల్ రన్ ఆగిపోతే, కచ్చితంగా మార్చి 28 న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం భాషల్లో అందుబాటులోకి వచ్చేస్తుంది. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది, త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Also Read : శ్రీను, రాజమౌళి ప్రేమించిన అమ్మాయి గురించి తెలియని షాకింగ్ మేటర్స్… ఆమె మొదటి భర్త ఎవరు?