2021 సంవత్సరంలో బంగారం ధర తగ్గుతుందా..? పెరుగుతుందా..?

ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో బంగారం క్రయవిక్రయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం 22 గ్రాముల బంగారం ధర 46,000కు అటూఇటుగా ఉంది. మరి కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతాయా..? పెరుగుతాయా..? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. అయితే బులియన్ మార్కెట్ నిపుణులు మాత్రం కొత్త ఏడాదిలో బంగారం ధర తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Also Read: పాస్ వర్డ్స్ తరచూ మరిచిపోతున్నారా.. ఈ పని […]

Written By: Kusuma Aggunna, Updated On : December 19, 2020 4:08 pm
Follow us on


ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారతదేశంలో బంగారం క్రయవిక్రయాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ఏడాది బంగారం ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం 22 గ్రాముల బంగారం ధర 46,000కు అటూఇటుగా ఉంది. మరి కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతాయా..? పెరుగుతాయా..? అనే సందేహం చాలామందిని వేధిస్తోంది. అయితే బులియన్ మార్కెట్ నిపుణులు మాత్రం కొత్త ఏడాదిలో బంగారం ధర తగ్గుతుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: పాస్ వర్డ్స్ తరచూ మరిచిపోతున్నారా.. ఈ పని చేస్తే సమస్యకు చెక్..?

కరోనా వైరస్ విజృంభణ కారణంగా ఈ ఏడాది బంగారం ధరలు ఊహించని స్థాయిలో పెరిగాయని కానీ 2021లో ఒకటికి మించిన కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో ధరలు తగ్గే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్లు ఇప్పటికే అందుబాటులోకి రాగా అతి త్వరలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ సైతం అందుబాటులోకి రానుంది.

Also Read: క్రిస్మస్ స్పెషల్: ఆసియాలోనే అతి పెద్ద చర్చి.. మెదక్‌ కేథడ్రల్

వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తే దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. అందువల్ల పసిడి ధరలు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీర్ఘకాలంలో పసిడిలో పెట్టవచ్చని తాత్కాలికంగా పెట్టుబడులు పెడితే మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండదని నిపుణులు చెబుతున్నారు. 2021లో పసిడి ధర 40,000 నుంచి 50,000 లోపే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

వ్యాక్సిన్ల గురించి వెలువడుతున్న ప్రకటనల కారణంగా గత కొన్ని రోజుల నుంచి బంగారం ధర అంతకంతకూ తగ్గుతోంది. ఈ ఏడాది ఆగష్టు నెలలో పసిడి ధర రికార్డు రేటును అందుకుంది. ఆ తరువాత క్రమంగా తగ్గుముఖం పట్టింది.