Prabhu Deva copies Brahmanandam Dance : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ‘ప్రభుదేవా’ కొరియోగ్రాఫర్ గా తన కంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలన్నింటిలో కొరియోగ్రాఫర్ గా చాలా మంచి గుర్తింపైతే వచ్చింది. ‘ఇండియన్ మైకల్ జాక్సన్’ గా తనకంటూ ఒక గొప్ప పేరు ను సంపాదించుకున్నాడు. మంచు విష్ణు(Vishnu) హీరోగా వస్తున్న కన్నప్ప (Kannappa) సినిమాలో కూడా ఆయన ఒక సాంగ్ కి కొరియోగ్రఫీ చేశాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఒక ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. దానికి బ్రహ్మానందం కూడా హాజరయ్యారు. ఆ ఈవెంట్లో బ్రహ్మానందం ప్రభుదేవా గురించి మాట్లాడుతూ నేనేసిన స్టెప్పులన్నింటినీ కాపీ చేసి సాంగ్స్ కొరియోగ్రఫీ చేస్తూ ప్రభుదేవా (Prabhudeva) టాప్ కొరియోగ్రాఫర్ గా ఎదిగాడు ఇదంతా నా వల్లే జరిగింది అంటూ బ్రహ్మానందం (Bramhanandam) కామెడీగా మాట్లాడటం అందరిని ఆకట్టుకుంది… బ్రహ్మానందం అభిమానులు ఆగడు (Agadu) సినిమాలో బ్రహ్మానందం వేసిన స్టెప్పులను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఈ స్టెప్పులను కాపీ చేసే ప్రభుదేవా స్టార్ కొరియోగ్రాఫర్ గా మారిపోయాడు అంటూ ఫన్నీగా కామెంట్స్ అయితే చేస్తున్నారు. మొత్తానికైతే బ్రహ్మానందం చేసిన వాక్యాలు చాలా కామెడీగా ఉండడంతో ప్రభుదేవా సైతం నవ్వుకున్నాడు…
Also Read : వయసు రెండు సంవత్సరాలు.. 250 కోట్లకు యజమాని అయిపోయింది..
ప్రభుదేవా అటు కొరియోగ్రాఫర్ గా ఇటు నటుడిగా, దర్శకుడిగా అన్ని రకాల బాధ్యతలను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఆయన కెరియర్ స్టార్టింగ్ లో ప్రభుదేవా మైకల్ జాక్సన్ వీడియోస్ ని పెట్టుకుని దాదాపు రోజుకు 18 గంటల పాటు ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారట. అందువల్లే అతనికి డ్యాన్స్ మీద అంత గ్రిప్ అయితే వచ్చిందని ఒకానొక సందర్భంలో ప్రభుదేవా చెప్పడం విశేషం.
నిజానికి ప్రభుదేవా లాంటి కొరియోగ్రాఫర్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం సినిమా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి… ఇక ఈ వరల్డ్ లోనే మైకల్ జాక్సన్ తర్వాత అంత గొప్ప పేరు సంపాదించుకున్న కొరియోగ్రాఫర్ అయితే ఎవరు లేరు. ఆయన తర్వాత ఉన్నవాళ్లల్లో ప్రభుదేవా మాత్రమే బెస్ట్ కొరియోగ్రాఫర్ ఉన్నాడు. కాబట్టి అతనికి ఇండియన్ మైఖేల్ జాక్సన్ అంటూ నామకరణం కూడా చేసేశారు.
మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లాంటి స్టార్ హీరో సైతం ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక సాంగ్ అయినా కూడా ప్రభుదేవా చేత కొరియోగ్రఫీ చేయిస్తూ ఉంటాడు. చిరంజీవికి ప్రభుదేవా మీద చాలా నమ్మకం ఇక ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుదేవా కూడా ఆయన చేసే సాంగ్ సూపర్ డూపర్ సక్సెస్ చేసేలా కష్టపడుతూ ఉంటాడు…