Prabhas Spirit Movie: స్పిరిట్ సినిమాలో ఒక బోల్డ్ సీన్ లో నటించనున్న ప్రభాస్…

Prabhas Spirit Movie: స్పిరిట్ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఇంతకు ముందు అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు.

Written By: Gopi, Updated On : June 17, 2024 11:16 am

Prabhas will act in a bold scene in Spirit Movie

Follow us on

Prabhas Spirit Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్…ప్రస్తుతం ఆయన వరుస సినిమాలు చేయడానికి సన్నాహాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఆయన చేసిన ‘కల్కి’ సినిమా ఈనెల 27వ తేదీన రిలీజ్ కి రెడీ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన ఆ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అయితే కల్కి సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన స్పిరిట్ సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక స్పిరిట్ సినిమాకి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఆయన ఇంతకు ముందు అర్జున్ రెడ్డి, అనిమల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు స్పిరిట్ సినిమాతో భారీ సక్సెస్ ని అయితే తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన చేసిన అనిమల్ సినిమా 900 కోట్ల వరకు కలెక్షన్స్ ను రాబట్టింది. ఇక ఈ సినిమాతో 2000 కోట్ల వరకు కలెక్షన్స్ కొల్లగొట్టడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ బెడ్ రూమ్ సీన్ లో నటించాల్సి ఉందట.

Also Read: ఈ క్యూట్ పాప.. తెలుగులో స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

ఇక అనిమల్ సినిమాలో రణ్బీర్ కపూర్ చేసినట్టుగా అలాంటి సీను ఒకటి ఈ సినిమాలో చేయాలని సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరి దానికి ప్రభాస్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా లేదా అనే విషయం అయితే ఇంకా స్పష్టం గా తెలియడం లేదు. కానీ మొత్తానికైతే ప్రభాస్ తో ఈ సినిమాలో సందీప్ ఆ సీన్ మాత్రం తప్పకుండా చేయిస్తాడు అనే వార్తలైతే వస్తున్నాయి.

Also Read: Mammootty: విజయ్ సేతుపతి, ఫహాద్ ఫజిల్ కాదు..విలన్ పాత్రలో ఆ నటుడు చేసి ఉంటే కథ వేరేలా ఉండేది..?

ఎందుకంటే ఆ సీన్ ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ అని కూడా తెలుస్తుంది. ఇక సందీప్ రెడ్డివంగా సినిమా అంటే అందులో కొన్ని బోల్డ్ సీన్లు ఉండడం సహజంగా మనం చూస్తూనే ఉంటాం. కాబట్టి ఈ సినిమాలో కూడా అలాంటి సీన్లు ఉంటాయని ఆయన ముందు నుంచి కూడా చెబుతూ వస్తున్నాడు. అయితే ప్రభాస్ కి లేడీ ఫ్యాన్స్ కూడా చాలా మంది ఉన్నారు. మరి ఆయన అలాంటి సీన్స్ చేస్తే అభిమానుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సీన్ల ను ప్రభాస్ చేస్తాడా లేదా అనేది…