Prabhas Venky Movie Meme Controversy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ (Prabhas) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్న ఆయన ఆ తర్వాత చేస్తున్న సినిమాలన్నింటితో పెను ప్రభంజనాలను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు. ముఖ్యంగా ఆయన చేసిన సినిమాలన్నింటికి భారీ ఓపెనింగ్స్ రావడమే కాకుండా తనదైన రీతిలో సత్తా చాటుతూ ఇండస్ట్రీలో పలు రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇతర హీరోల సక్సెస్ సినిమాలకు ఎంత అయితే కలెక్షన్స్ వస్తాయో తన ప్లాప్ సినిమాలకి కూడా అంతకుమించిన కలెక్షన్స్ రావడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. బాహుబలి సినిమాతో నార్త్ ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకున్న ఆయన సలార్ (Salaar), కల్కి (Kalki) లాంటి సినిమాలతో తనలోని పూర్తి నటుడిని బయటకు తీసి యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇక ప్రస్తుతం హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజీ (Fouji) సినిమాతో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించి మెప్పించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత సందీప్ రెడ్డి వంగ (Sundeep Reddy Vanga) దర్శకత్వంలో చేయబోతున్న స్పిరిట్ (Spirit) సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాలతో తనను తాను మరోసారి స్టార్ హీరోగా ఎలివేట్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు.
ప్రభాస్ ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకోడు. స్వతహాగా ఆయన మృదు స్వభావి, ఆయన కాంట్రవర్సీ లకు చాలా దూరంగా ఉంటాడు. కానీ రీసెంట్ గా ఆయన కొన్ని ఇంటర్వ్యూల్లో కొన్ని సినిమాల పేర్లు చెబుతూ తనకు నచ్చిన పాటల గురించి మాట్లాడుతూ కొన్ని పాటలు అయితే పాడాడు.
Also Read: Prabhas : ప్రభాస్ తో ఆ సినిమా చేస్తే బాగా వర్కౌట్ అవుతుందా..?
ఇక దానికి యాంటీ ఫ్యాన్స్ రవితేజ హీరోగా వచ్చిన వెంకీ (Venky)సినిమాలో బ్రహ్మానందం పాట పాడేటప్పుడు ఎలాగైతే రవితేజ ‘పాడు గజాల పాడు’ అంటాడో ఆ వీడియోని యాడ్ చేసి ప్రభాస్ పాడిన పాటని ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ లాంటి ఒక హీరోని అలా చేయడం అనేది తన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఇక మరికొంతమంది మాత్రం జస్ట్ కామెడీ కోసం అలాంటి వీడియోని చేశారు అందులో తప్పేముంది అంటూ ట్రోల్ చేసేవాళ్లను సమర్థిస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోం. ఇక ప్రభాస్ తన తదుపరి సినిమాల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తున్నట్టుగా తెలుస్తోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టి వాటిని తొందరగా ఫినిష్ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది.