Homeఆంధ్రప్రదేశ్‌Jagan Disqualification Fear 2025: జగన్ అరెస్ట్.. జరిగేది అదే!

Jagan Disqualification Fear 2025: జగన్ అరెస్ట్.. జరిగేది అదే!

Jagan Disqualification Fear 2025: జగన్ ( Y S Jagan Mohan Reddy )ఒక ప్రత్యేక నాయకుడు. కేవలం సానుభూతి నుంచి పుట్టుకొచ్చిన నేత. ఆయన విపరీతమైన రాజకీయ పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కూడా కాదు. అలాగని సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కూడా లేదు. కడప ఎంపీ అయ్యారు. తండ్రి మరణంతో పార్టీని స్థాపించారు. అటు తర్వాత ప్రతిపక్ష నేతకు వచ్చారు. ఏకంగా ఈ రాష్ట్రానికి సీఎం అయిపోయారు. అయితే ఆయన మధ్యలో జైలు జీవితం గడిపారు. అప్పటివరకు ఆయన ముఖ్యమంత్రి కుమారుడు గానే సుపరిచితుడు. ఎప్పుడైతే కేసుల్లో జైల్లో పెట్టడం, 16 నెలల పాటు బెయిల్ లేకుండా చేయడం వంటి కారణాలతో ఆయన పై విపరీతమైన సానుభూతి వ్యక్తం అయింది. ఒకవైపు తండ్రి మరణం, ఇంకోవైపు జైలు జీవితం.. ఇలా పుట్టుకొచ్చిన సానుభూతి నుంచి వచ్చినవారే జగన్మోహన్ రెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే తన జైలు జీవితమే ఇంతటి తిరుగులేని నాయకత్వాన్ని ఇచ్చింది.

Also Read: Jagan Court Case Update: అవి జీవిత ఖైదు సెక్షన్లే.. జగన్ జైలుకు వెళ్లక తప్పదా?

అనర్హత వేటు పడుతుందని..
అయితే జైలు నుంచి బయటకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి.. మళ్లీ జైలుకు భయపడడం లేదు. కానీ అదే కేసులలో తనపై అనర్హత వేటు పడితే మాత్రం కోలుకోలేని దెబ్బ తగులుతుందని భయపడుతున్నారు. అందుకే కేంద్రంలో ఉన్న బిజెపితో( Bhartiya Janata Party) పరోక్ష స్నేహం కొనసాగిస్తూ వచ్చారు. అయితే రాజకీయ పార్టీల ఏర్పాటుకు, అధికారంలోకి వచ్చేందుకు ధైర్యంతో కూడిన దూకుడు తనం అవసరం. జగన్ అందుకే అధికారంలోకి వచ్చే వరకు తన దూకుడు ప్రదర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఆయనలో భయం మొదలైంది. దూకుడు తగ్గి కేంద్ర పెద్దలతో సఖ్యత ఏర్పాటు చేసుకున్నారు. ఒకవేళ కేంద్రంలో బిజెపి కాదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే వారితో కూడా ఈ సఖ్యత తప్పనిసరి. అయితే ఇప్పుడు జైలుకు వెళ్తే సానుభూతి.. కేసులు పడితే ప్రజల గుర్తింపు అన్న రోజులు ఇవి. అందుకే తాజాగా జగన్మోహన్ రెడ్డి పై నమోదైన కేసుల విషయంలో అరెస్టు ఉంటుందా? లేదా? అరెస్టు చేస్తే ఆయన సానుభూతి పొందుతారా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తోంది.

12 సంవత్సరాలుగా బెయిల్ పై..
కేంద్రంలో కాంగ్రెస్( Congress) అధికారంలో ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి పై అవినీతి కేసులు నమోదయ్యాయి. ఆయనను సిబిఐ అరెస్టు చేసింది. 16 నెలల పాటు జైల్లో ఉంచింది. ప్రస్తుతం గత 12 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన అరెస్టు ఉంటుందని ప్రచారం నడిచింది. అవినీతి కేసులు తిరగదోడుతారని టాక్ అయితే మాత్రం వచ్చింది. అటు తరువాత మద్యం కుంభకోణం కేసు వెలుగులోకి వచ్చింది. అందులో సైతం అరెస్టు ఉంటుందని తెగ హడావిడి నడిచింది. కానీ అటువంటిదేమీ లేకుండా పోయింది. అయితే తాజాగా సింగయ్య అనే వైసీపీ కార్యకర్త మృతికి సంబంధించి.. జగన్మోహన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. విచారణ పేరిట పిలిచి అరెస్టు చేస్తారని ప్రచారం అయితే సాగుతోంది.

Also Read: Singayya Death Case: సింగయ్య మృతి.. జగన్ కు మూడింది.. ఏ2గా కేసు.. అరెస్ట్ తప్పదా?

ఆ అంచనా కష్టమే
అయితే ఇప్పుడు జగన్ అరెస్ట్ తో విపరీతమైన సానుభూతి వస్తుందని అంచనా వేయలేకపోతోంది వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ. దానికి కారణం లేకపోలేదు. తన వాహనం కిందపడి వైసీపీ కార్యకర్త మృతి చెందడం మైనస్ గా మారింది. ఓ కార్యకర్త చనిపోయేటంత నిర్లక్ష్య స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉండడం పై కూడా విమర్శలు ఉన్నాయి. అయితే అదే సమయంలో కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతోందని ప్రజలు భావిస్తే మాత్రం జగన్ అరెస్ట్ అనేది విపరీతమైన సానుభూతి తెచ్చి పెడుతుంది. అందుకే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డిని బూచిగా చూపించేందుకు వీడియో విడుదల చేశారని.. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డికి భారీగా డ్యామేజ్ జరిగిందని కూటమి అంచనా వేస్తోంది. చూడాలి ఎవరి ఆలోచనలు వారివే. అంతిమంగా ఏం జరుగుతుందో..!

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular