War 2 Movie: వార్ 2లో ఎన్టీయార్ పాత్ర కనిపించేది అంత సేపేనా..? మన హీరోల విషయంలో బాలీవుడ్ వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు..?

War 2 Movie:

Written By: Gopi, Updated On : July 15, 2024 1:51 pm

Will NTR character be seen a few minutes in War 2

Follow us on

War 2 Movie: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన నటనతో మెప్పించి ప్రతి పాత్ర కి ప్రాణం పోసే నటులు కొంతమంది మాత్రమే ఉన్నారు. అందులో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈ జనరేషన్ లో ఉన్న స్టార్ హీరోలందరి కంటే జూనియర్ ఎన్టీఆర్ నటనలో చాలా ప్రావీణ్యం కలవాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఎంత పెద్ద డైలాగులు అయిన సరే సింగిల్ టేక్ లో చెప్పే మెమొరీ పవర్ కలిగిన హీరో కూడా తనే కావడం విశేషం..ఇక ప్రస్తుతం ఆయన కొరటాల శివ డైరెక్షన్ లో ‘దేవర ‘ అనే సినిమా చేస్తున్నాడు. ‘త్రిబుల్ ఆర్ ‘ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ఎన్టీయార్ ఇప్పుడు దేవర సినిమాతో సోలో గా పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే కొరటాల శివ కూడా ఈ సినిమాతో మరోసారి తను సక్సెస్ ట్రాక్ ఎక్కాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మొత్తానికైతే ఇద్దరూ కలిసి భారీ విక్టరీని సాధించే ప్రయత్నంలో బిజీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అందుకోసమే వీళ్ళు ఏమాత్రం రెస్టు తీసుకోకుండా తీవ్రంగా శ్రమిస్తున్నారట. ఇక దేవర సినిమాని సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకోవచ్చే ప్రయత్నంలో వాళ్ళు నిమగ్నమైపోయారు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ దేవర సినిమాతో పాటుగా బాలీవుడ్ లో ‘వార్ 2’ అనే సినిమాను కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో హృతిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నా ఎన్టీఆర్ ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు. బాలీవుడ్ దర్శకుడు ఎన్టీఆర్ ని ఎలా చూపిస్తాడనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.

నిజానికి ఇంతకు ముందు ప్రభాస్ ని కూడా ‘ఆది పురుషు’ సినిమాతో చాలా గొప్పగా చూపిస్తామంటూ బాలీవుడ్ దర్శకుడు ఓం రావత్ ప్రగల్భాలు పలికి ఆ సినిమాని చాలా వరస్ట్ గా తీయడమే కాకుండా ప్రభాస్ ఇమేజ్ ను కూడా చాలా వరకు డ్యామేజ్ చేశాడు. ఇక మన పవిత్ర గ్రంధం అయిన రామాయణాన్ని భ్రష్టు పట్టించాడు. మొత్తానికైతే ప్రభాస్ లాంటి ఒక నటుడు ఆది పురుషు సినిమాలో చేయడం నిజంగా చింతించ దగిన విషయమనే చెప్పాలి…ఇక అలాగే ఎన్టీఆర్ ని కూడా ఇలాంటి పరిస్థితిల్లోకే బాలీవుడ్ వాళ్ళు తీసుకొస్తున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. మరి ఎన్టీఆర్ మాత్రం తనకు సంబంధించిన సీన్స్ ని తనే దగ్గరుండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. తనకు చెప్పిన సీన్స్ అన్ని దర్శకుడు తెరకెక్కిస్తున్నాడా? లేదా తన క్యారెక్టర్ కి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనే విషయాలను కూడా తను చాలా వరకు దర్శకుడితో చర్చించుకున్నాకే ఈ సినిమా కోసం రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది.

కానీ వాళ్ళు మాత్రం ఎన్టీఆర్ ని బుక్ చేసి ఆయన పాత్రను చాలా తక్కువ సమయం చూపించే ప్రయత్నం అయితే జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఎన్టీఆర్ పాత్ర ఏ విధంగా ఉంది. అది ఎంతవరకు ఎన్టీఆర్ కెరియర్ కి ప్లస్ అయింది అనేది సరిగ్గా తెలియదు… ఇక మొత్తానికైతే ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చూడాల్సిందే తప్ప ఇప్పుడప్పుడే ఈ విషయం మీద సరైన క్లారిటీ అయితే రాదు అంటూ ట్రేడ్ పండితులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఎన్టీయార్ ఈ రెండు సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను అందుకుంటాడు అనేది…