https://oktelugu.com/

Prabhas – Ram Charan : చరణ్ కూతురు క్లిన్ కారకు ప్రభాస్ సర్ప్రైజింగ్ గిఫ్ట్… ఉపాసన రియాక్షన్ చూడాలి!

క్లిన్ కార వీటితో ఆడుకుంటున్న ఫొటోలు ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఉపాసన కల్కి టీం కి థాంక్స్ చెబుతూ సినిమాకి ' ఆల్ ది బెస్ట్ ' చెప్పారు. ఉపాసన పోస్ట్ వైరల్ గా మారింది.

Written By:
  • NARESH
  • , Updated On : June 3, 2024 / 06:44 PM IST

    Prabhas' surprising gift to Ramcharan's daughter Klin Kara

    Follow us on

    Prabhas – Ram Charan : రామ్ చరణ్ – ఉపాసనల గారాలపట్టి క్లిన్ కార ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో క్లిన్ కార డార్లింగ్ ప్రభాస్ పంపించిన గిఫ్స్ తో ఆడుకుంటూ కనిపించడం విశేషం. ఇంతకీ ప్రభాస్, క్లిన్ కారకు ఇచ్చిన ఆ స్పెషల్ గిఫ్ట్ ఏంటో తెలుసా. ఆ బహుమతి గురించి తెలిస్తే ఆశ్చర్యపోతారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

    ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్ కల్కి టీం చాలా ప్రత్యేకంగా నిర్వహిస్తున్నారు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో దాదాపు రూ. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రభాస్ కు జంటగా బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తుంది. దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తుంది. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి దిగ్గజ నటులు కీలక పాత్రలో కనిపించనున్నారు.

    కల్కి సినిమాలో బుజ్జి క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. కాగా ఇటీవల బుజ్జి ని ఇంట్రడ్యూస్ చేస్తూ కల్కి టీం ఒక స్పెషల్ ఈవెంట్ నిర్వహించారు. ప్రభాస్ బుజ్జి ని డ్రైవ్ చేస్తూ వచ్చి ఈవెంట్ లో సందడి చేశారు. ఈ మధ్యనే బుజ్జి అండ్ భైరవ పేరుతో ఒక యానిమేటెడ్ సిరీస్ ని మేకర్స్ ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు. ఇందులో బుజ్జి, భైరవ మధ్య పరిచయం ఎలా అయింది. వాళ్లిద్దరూ చేసిన సాహసాలు ఏంటో మనం చూడొచ్చు.

    తాజాగా కల్కి ప్రమోషన్స్ లో భాగంగా సెలెబ్రెటీ పిల్లలకు గిఫ్ట్ లు పంపిస్తున్నారు. రామ్ చరణ్ కూతురు క్లిన్ కారకు మూవీ యూనిట్ గిఫ్ట్ పంపించారు. ఇందులో బుజ్జి – భైరవ స్టిక్కర్స్, బుజ్జి బొమ్మ, టీ షర్ట్స్ లాంటివి ఉన్నాయి. క్లిన్ కార వీటితో ఆడుకుంటున్న ఫొటోలు ఉపాసన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. ఉపాసన కల్కి టీం కి థాంక్స్ చెబుతూ సినిమాకి ‘ ఆల్ ది బెస్ట్ ‘ చెప్పారు. ఉపాసన పోస్ట్ వైరల్ గా మారింది.