Children: ఇంట్లో పిల్లలు ఉంటే ఆ ఇంటి కలనే వేరు కదా. ఇక ఆడపిల్ల ఉంటే అయితే ఇల్లంతా మహాలక్ష్మీ తిరిగినట్టు ఉంటుంది. చేతులకు గాజులు, కాళ్లకు పట్టీలు పెట్టుకొని పాప నడుస్తుంటే ఇంట్లో ఉన్నవారు ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంటారు. ఇక పిల్లలను పెంచడం ఒక గొప్ప కల. వారితో ఆడుకోవడం, పాడటం, వారికి నచ్చజెప్పడం, నేర్పించడం ఈ పనులు అన్నీ చేస్తుంటే అసలు సమయమే తెలియదు. తెలియకుండానే సంవత్సరాలు గడిచిపోతుంటాయి. అయితే ఇలా చేయడం వల్ల చాలా మేలు జరుగుతుంది అంటుంది ఓ పరిశోధన.
పిల్లలకి పాలుపట్టడం, లాల పోయడం, తినిపించడం, వాళ్ళతో ఆడుకోవడం… ఇవన్నీ కొందరికి ఇష్టంగా అనిపిస్తే మరికొందరికి మాత్రం భారంగా అనిపిస్తుంటుంది. ముఖ్యంగా- సాయం చేసేవాళ్ళెవరూ ఇంట్లో లేకపోతే అప్పుడే పుట్టిన బిడ్డని తల్లిదండ్రులు ఒకరే చూసుకోవాల్సి వస్తే మరింత కష్టంగా భావిస్తున్నారు ఈ తరం తల్లిదండ్రులు. అయితే సరిగ్గా ఈ దశలో కాస్త ఓపిక తెచ్చుకుని పిల్లల బాధ్యతని సమానంగా పంచుకున్న తల్లిదండ్రులకి ఫ్యూచర్ లో చాలా మేలు జరుగుతుంది అంటున్నారు పరిశోధకులు.
Also Read: Children: ఈ అలవాట్లు మీ పిల్లలకు కచ్చితంగా నేర్పించండి
ఓ పరిశోధనలో ఈ విషయం తెలిసిందట. అయితే ఇలా పిల్లలను బాధ్యతగా చూసుకున్న వారు, వారితో ప్రతి ఒక్క పని ఇష్టంగా చేసే వారి మెదడులో వృద్ధాప్యంతో వచ్చే రుగ్మతలు తక్కువగా ఉంటాయి అంటున్నారు. అమెరికాలోని యేల్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేసి ఈ విషయాన్ని తెలిపారు. అయితే దీని కోసం ఓ 40 నుంచి 70 సంవత్సరాల మధ్య వయసున్న 37 వేల మంది మెదడు.. ఎమ్మారై స్కాన్‌లని పరిశీలించారు.
Also Read: Girls: ఇలాంటి లక్షణాలు మీకు ఉన్నాయా? అయితే అమ్మాయిలు అసలు ఇష్టపడరు..
వీరందరికి ఎంతమంది పిల్లలు? ఆ పిల్లల పెంపకంలో క్రియాశీలకంగా ఉన్నారా? లేదా? వంటి వివరాలన్నింటిని సేకరించారు. వీటన్నింటిని పరీక్షించి పిల్లల పెంపకంలో పూర్తిగా బాధ్యతగా ఉన్న వారి మెదడు- వృద్ధాప్యం లోనూ ఎక్కువ చురుగ్గా ఉందని తేల్చి చెప్పారు. మరి మీ పిల్లల విషయంలో మీరు కూడా అంతే క్రియాశీలకంగా పనులు నిర్వహించండి. తర్వాత ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోండి.