Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas)…కెరియర్ మొదటి నుంచి కూడా మంచి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ వస్తున్నాడు. బాహుబలి (Bahubali) సినిమాతో పాన్ ఇండియా లో సూపర్ సక్సెస్ ను సాధించాడు. దాంతో ఆయన ఇకమీదట చేయబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు.యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఐడెంటిటిని సంపాదించుకున్న ఆయన ఇకమీదట ఎలాంటి గుర్తింపును సంపాదించుకుంటాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో సంబంధం లేకుండా రాబోయే సినిమాలు భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టి ఆయనను నెంబర్ వన్ హీరోగా మారుస్తాయా లేదా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read : పవన్ కళ్యాణ్ బాటలోనే ప్రభాస్..ఫ్యాన్స్ కి చుక్కలు చూపిస్తున్న హీరోలు!
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ ని మించిన నటుడు మరొకరు లేరు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ ఒకానొక సమయంలో ఒక సూపర్ హిట్ సినిమాను మిస్ చేసుకున్నాడనే విషయం మనలో చాలామందికి తెలియదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన గోలీమార్ సినిమాని మొదట ప్రభాస్ హీరోగా చేయాలని అనుకున్నాడట.
కానీ అప్పుడు ప్రభాస్ బిజీగా ఉండడం వల్ల ఈ సినిమాని గోపీచంద్ తో చేశాడు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకొన్నాడు. గోపీచంద్ కెరియర్ లో కూడా ఈ సినిమా ఒక సూపర్ డూపర్ సక్సెస్ ను సాధించి తన మార్కెట్ ని భారీగా పెంచిందనే చెప్పాలి…
ఇక బయట ప్రభాస్, గోపీచంద్ ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్ అనే విషయం మనకు తెలిసిందే. కాబట్టి గోపిచంద్ విజయం సాధించిన కూడా అది ప్రభాస్ విజయం గానే భావిస్తూ ఉంటాడు. ప్రభాస్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ అనే రెండు సినిమాలు వచ్చాయి…
ఈ రెండు సినిమాల్లో కూడా ప్రభాస్ విభిన్నమైనా నటనను కనబరిచి తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు… ప్రభాస్ లాంటి నటుడు చేస్తున్న సినిమాలు తప్పిన రికార్డులను క్రియేట్ చేసి మరోసారి తన ఇష్టమైన ఏంటో చూపిస్తే మాత్రం ఇంజన్ సినిమా ఇండస్ట్రీలో ఆయనను మించిన హీరోలు మరెవరు ఉండరు అనేది చాలా స్పష్టంగా తెలుస్తోంది.
Also Read : భీమవరంలో కొత్త హాస్పిటల్..ఉచిత వైద్యం..గొప్ప మనసు చాటుకున్న ప్రభాస్!