DC Vs RR IPL 2025: కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు స్టార్క్ చుక్కలు చూపించాడు.. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన స్టార్క్ 14 మాత్రమే పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ప్రమాదకరమైన అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠిని వెనక్కి పంపించి..సన్ రైజర్స్ కు దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు. హర్షిత్ రాణా 2, రస్సెల్ 3 వికెట్లు పడగొట్టడంతో సన్ రైజర్స్ 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. అనంతరం ఈ టార్గెట్ ను కోల్ కతా 10.3 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫైనల్ మ్యాచ్లో స్టార్క్ చేసిన బౌలింగ్ ను ఇప్పటికీ కోల్ కతా అభిమానులు మర్చిపోలేరు.
Also Read: నరాలు తెగే ఉత్కంఠ.. ఢిల్లీ vs రాజస్థాన్ మ్యాచ్ టై.. గెలుపు ఎవరిని వరించిందంటే?
మళ్లీ ఇప్పుడు
బుధవారం నాటి మ్యాచ్లో రాజస్థాన్, ఢిల్లీ స్కోర్లు సమం కావడానికి ప్రధాన కారణం స్టార్క్. ఎందుకంటే రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయం లో చివరి ఓవర్ ను స్టార్క్ వేశాడు. వాస్తవానికి ఆ ఓవర్ ను అక్షర్ పటేల్ స్టార్క్ కు ఇచ్చేందుకు.. చివరి వరకు అతడిని ఆపాడు. రాజస్థాన్ ఇన్నింగ్స్ సమయంలో స్టార్క్ నాలుగు ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చాడు.. నితీష్ రాణా వికెట్ మాత్రమే తీశాడు. అయినప్పటికీ అతడి మీద కెప్టెన్ అక్షర్ నమ్మకం ఉంచాడు.. ఇక చివరి ఓవర్ ను స్టార్క్ అద్భుతంగా వేశాడు. 19 ఓవర్లో మోహిత్ శర్మ 14 పరుగులు ఇవ్వడంతో రాజస్థాన్ స్కోర్ 180 పరుగులకు చేరుకుంది. దీంతో చివరి ఓవర్ లో ఎలాగైనా రాజస్థాన్ గెలుస్తుందని అందరూ అనుకున్నారు. అయితే చివరి ఓవర్లో స్టార్క్ 8 పరుగులు మాత్రమే ఇచ్చాడు. హిట్ మేయర్, ధృవ్ జురెల్ వంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ స్టార్క్ ఏమాత్రం భయపడకుండా బంతులు వేశాడు. ఇక చివరి బంతికైతే రెండు పరుగులు తీయాల్సిన.. చోట ధృవ్ జురెల్ రెండవ రన్ తీసే సమయంలో అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా టై అయింది. ఇక టై మ్యాచ్ లో స్టార్క్ బౌలింగ్ వేశాడు. కేవలం 11 రన్స్ మాత్రమే ఇచ్చాడు.. ఇందులో జైస్వాల్, హిట్ మేయర్ రన్ అవుట్లయ్యారు. రెండు వికెట్లు కోల్పోవడంతో.. ఐసీసీ నిబంధనల ప్రకారం రాజస్థాన్ ఆటగాళ్లకు కేవలం నాలుగు బంతులు మాత్రమే అవకాశం లభించింది. అయితే 11 పరుగుల టార్గెట్ ను ఢిల్లీ ఆటగాళ్లు రాహుల్, స్టబ్స్ నాలుగు బంతుల్లోనే ఫినిష్ చేయడం విశేషం. మొత్తంగా నాడు కోల్ కతాకు, నేడు ఢిల్లీకి వజ్రాయుధం లాగా స్టార్క్ తోడ్పడ్డాడు.. కాగా, స్టార్క్ ను 11.75 కోట్లకు 2025 సీజన్ కు సంబంధించిన వేలంలో ఢిల్లీ జట్టు కొనుగోలు చేయడం విశేషం.
Also Read: రాజస్థాన్ పై ఢిల్లీ బ్యాటింగ్.. అసలు హైలెట్స్ ఇవే