Prabhas: సినిమాల్లోనే కాదు, నిజజీవితంలో కూడా ప్రభాస్(Rebel Star Prabhas) కి బాహుబలి లాంటి పెద్ద మనస్సు ఉందనే విషయం మన అందరికీ తెలిసిందే. అందరూ తెలిసి దానధర్మాలు చేస్తారు. కానీ ప్రభాస్ మాత్రం తానూ చేసిన సహాయాన్ని మూడో కంటికి కూడా తెలియకుండా చేస్తాడు. ఇలాంటి మనుషులు చాలా అరుదు గా ఉంటారు. ముఖ్యంగా రాష్ట్రానికి ఏదైనా విపత్తు వస్తే, ప్రభాస్ చేసే సహాయం చాలా భారీగానే ఉంటుంది. అందరి హీరోలకంటే ఎక్కువ డబ్బులు విరాళం అందిస్తుంటాడు. ఉదాహరణకు ఇటీవలే విజయవాడ లో వచ్చిన వరదలను తీసుకోవచ్చు. అయితే ప్రభాస్ ఇప్పటి వరకు ఎంతోమంది చిన్న పిల్లలను చదివించాడు, ఎన్నో వైద్య సేవలను ఇచితంగా అందించాడు. అయితే త్వరలోనే ఆయన తన పెద్దనాన్న చివరి కోరిక ని తీర్చబోతున్నట్టు సమాచారం. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి భీమవరం లో NRI ల సహాయ సహకారాలతో ఎంతో మందికి ఉచితంగా డయాబిటీస్ వైద్యం చేయించింది.
Also Read: తిరుమలలో 17 లక్షల రూపాయలతో అన్నదానం చేసిన పవన్ కళ్యాణ్ సతీమణి!
ప్రభాస్ కూడా అందుకు ఎంతో సహకరించేవాడు. కానీ ఇప్పుడు ఆయన భీమవరం ప్రజలకు శాశ్వత పరిష్కారంగా ఒక భారీ డయాబిటీస్ హాస్పిటల్ ని కట్టించబోతున్నట్టు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా త్వరలో మొదలు పెట్టబోతున్నాడట. భీమవరం లో జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజి బాబు) సహాయ సహకారాలతో ఈ హాస్పిటల్ కి త్వరలోనే గ్రాండ్ గా శంకుస్థాపన చేయబోతున్నాడట ప్రభాస్. స్వయంగా ఆయనే ఈ శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి , అభిమానులను ఉద్దేశించి ప్రసగిస్తాడని తెలుస్తుంది. అత్యాధునిక వైద్య పరికరాలతో, ఉన్నత స్థాయి డాక్టర్లతో ఈ హాస్పిటల్ ని నిర్మించబోతున్నారట. ఇక్కడ వైద్యానికి నయా పైసా కూడా ఖర్చుపెట్టాల్సిన అవసరం లేదట. కృష్ణం రాజు కి ఎప్పటి నుండో ఈ కోరిక ఉండేదని, ఆ కోరిక తీరకుండానే ఆయన కున్నమూశాడని, ఆయన సతీమణి శ్యామల దేవి తన తాహతుకు తగ్గట్టు ఉచిత వైద్యం చేయించేదని భీమవరం ప్రజలు అంటున్నారు.
అప్పట్లో కృష్ణం రాజు చనిపోయిన తర్వాత దినం కార్యక్రమం కోసం మొగళ్తూరు గ్రామం మొత్తాన్ని భోజనాలు పెట్టించాడు ప్రభాస్. ఈ ఘటన అప్పట్లో నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారింది. మరోసారి ప్రభాస్ ఇప్పుడు ఈ డయాబిటీస్ హాస్పిటల్ ద్వారా నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ కానున్నాడు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా తెలియాల్సి ఉంది. ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే ‘రాజా సాబ్'(Raja Saab Movie) మూవీ షూటింగ్ దాదాపుగా పూర్తి అయ్యింది. హను రాఘవపూడి తో చేస్తున్న సినిమా షూటింగ్ కూడా శరవేగంగా సాగుతుంది. ఇప్పుడు ఆయన త్వరలోనే సందీప్ వంగ(Sandeep Reddy Vanga) ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. రాజాసాబ్ చిత్రం ఈ ఏడాదిలోనే పూర్తి అవుతుంది కానీ, ఎప్పుడు విడుదల అవ్వబోతుంది అనే దానిపై క్లారిటీ రాలేదు.