https://oktelugu.com/

Spirit: ప్రభాస్ – సందీప్ వంగ కాంబోలో వస్తున్న స్పిరిట్ మూవీ షూట్ ఎప్పటి నుండి స్టార్ట్ అవ్వబోతుందంటే..?

సినిమా ఇండస్ట్రీలో రాణించాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ అనుకున్నంత ఈజీగా ఇక్కడ అవకాశాలు రావు...వచ్చిన అవకాశాలను ప్రూవ్ చేసుకోవడానికి కూడా చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి అయితే ఎదురవుతుంది...ఇక అలాంటి వాటిని ఎదుర్కొని వచ్చిన వాళ్లు మాత్రమే ఇక్కడ స్టార్ హీరోలుగా ఎదుగుతారు...

Written By:
  • Gopi
  • , Updated On : September 12, 2024 / 11:10 AM IST

    Spirit

    Follow us on

    Spirit: తెలుగులో ఈశ్వర్ సినిమాతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ప్రభాస్ మొదటి సినిమాతో నటుడిగా మంచి పేరు అయితే సంపాదించుకున్నాడు. ఇక వర్షం సినిమాతో మొదటి కమర్షియల్ సక్సెస్ ని అందుకున్న ఆయన వరుసగా తెలుగు సినిమాలను చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు యావత్ ఇండియన్ జనాలని ఆకట్టుకోవడం అనేది నిజంగా ఒక గొప్ప విషయమనే చెప్పాలి. ఇప్పటి వరకైతే పాన్ ఇండియా స్థాయిలో ప్రభాస్ ను మించిన స్టార్ హీరో మరొకరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన ఖాన్ త్రయానికి సైతం చెమటలు పట్టిస్తున్న ప్రభాస్ ముందు ముందు భారీ సక్సెస్ లను కొట్టడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ఆయన హను రాఘవ పూడి దర్శకత్వంలో ఫౌజీ అనే సినిమా చేస్తున్నాడు.

    ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ వంగ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ఒక రూత్ లెస్ కాపుగా కనిపించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. మరి ఇప్పటివరకు ప్రభాస్ ఇలాంటి పాత్రను పోషించలేదు. కాబట్టి ఇది తనకి చాలా స్పెషల్ పాత్ర అనే చెప్పాలి.

    మరి ఇందులో ఆయన ఏ విధంగా నటించి ప్రేక్షకులు మెప్పిస్తాడు అనేది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంది. సందీప్ రెడ్డి వంగ చేస్తున్న సినిమాలు వివాదాలకు, విమర్శలకు కేంద్ర బిందువుగా మారుతుంటాయి. ఇక ఇప్పటివరకు ఆయన చేసిన అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, అనిమల్ సినిమాలు విమర్శలను ఎదుర్కొని తట్టుకొని సూపర్ సక్సెస్ లుగా నిలిచాయి. సందీప్ రెడ్డి వంగకి భారీ క్రేజ్ అయితే పెరిగింది. మరి ఆయన చేస్తున్న సినిమాలు కొంచెం బోల్డ్ కంటెంట్ తో ఉంటాయి. అయినప్పటికీ హీరోల ఇమేజ్ మాత్రం చాలా టాప్ రేంజ్ లో చూపిస్తూ ఉంటాడు.

    ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాని 2025 సమ్మర్ నుంచి షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే అనౌన్స్ చేసి పెట్టిన ఈ సినిమా రెగ్యూలర్ షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది సమ్మర్ నుంచి సెట్స్ పైకి వెళ్లే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక పౌజీ సినిమా తర్వాత ప్రభాస్ ఒక మంచి మేకవర్ లో కనిపిస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది…