Prabhas and Sandeep Reddy Vanga : ఈశ్వర్(Eshwar) సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు ప్రభాస్(Prabhas)…మొదటి సినిమాతోనే నటుడిగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రాఘవేంద్ర (Raghavendra) సినిమాతో ప్రేక్షకులను పలకరించినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేక పోయింది. ఇక మొదటి రెండు సినిమాలు ఆశించిన మేరకు విజయాలను సాధించకపోయినా కూడా ఆ తర్వాత చేసిన ‘వర్షం’ సినిమాతో సూపర్ సక్సెస్ ను సాధించడమే కాకుండా స్టార్ ఇమేజ్ ను అందుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయనకంటూ ఒక సెపరేట్ క్రేజ్ ను కూడా సంపాదించి పెట్టుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు అడుగులు వేస్తున్నాడు. సలార్, కల్కి లాంటి రెండు భారీ బ్లాక్ బస్టర్ సినిమాలతో సూపర్ సక్సెస్ లను అందుకున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా అదే సక్సెస్ ఫార్ములాను ఫాలో అవ్వాలని చూస్తున్నాడు. ఇక ఇప్పటికే మారుతి (Maruthi) డైరెక్షన్ లో చేస్తున్న రాజాసాబ్ (Rajasaab) సినిమా తొందర్లోనే రిలీజ్ కి రెడీ అవ్వనున్న నేపద్యంలో ఈ సినిమాతో పాటుగా హను రాఘవపూడి (Hanu araghava pudi) దర్శకత్వంలో చేస్తున్న ఫౌజి (Fouji) సినిమాతో మరికొన్ని రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. మరి ఈ సినిమాలతో ఆయన ఎలాంటి పెను ప్రభంజనాలను సృష్టిస్తాడు. తద్వారా ఆయనకంటూ ఒక స్టార్ డమ్ క్రియేట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ప్రస్తుతం ఈ సినిమా తర్వాత ఆయన సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో విలన్ గా నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. జాన్ అబ్రహం ఇందులో విలన్ గా నటిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వచ్చాయి. మరి దానికి సందీప్ రెడ్డి వంగా గాని, ప్రభాస్ గాని ఎలాంటి స్పందనను తెలియజేయడం లేదు.
ఇక సినిమా యూనిట్ నుంచి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తే తప్ప ఈ సినిమాలో జాన్ అబ్రహం నటిస్తున్నాడా లేదా అనే విషయాల పట్ల సరైన క్లారిటీ అయితే రాదు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమాలతో మంచి సక్సెస్ ను సాధిస్తాడా తద్వారా ఆయనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. ప్రభాస్ లాంటి నటుడు సైతం పాన్ ఇండియాలో తనను తాను స్టార్ గా ఎలివేట్ చేసుకున్న విధానం అయితే చాలా గొప్ప స్థాయిలో ఉందనే చెప్పాలి. మరి ఇప్పుడు ఆయన చేయబోయే సినిమాలు తనను టాప్ రేంజ్ లో నిలుపుతాయా లేదా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కోసం ఇక ఎంతకాలం వెయిట్ చేయాలి…