Sandeep Reddy Vanga and Prabhas : ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న వాళ్ళలో సందీప్ రెడ్డి వంగ (Sabdeep Reddy Vanga)ఒకరు… ప్రస్తుతం అయిన ఏ సినిమా చేసిన కూడా ఆ సినిమా మీద భారీ బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇప్పటికే ఆయన చేసిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ అవ్వడంతో తన తదుపరి ప్రభాస్ (Prabhas) తో చేస్తున్న స్పిరిట్ (Spirit) సినిమా మీద భారీ అంచనాలైతే ఉన్నాయి… ఇక అనిమల్ (Animal) సినిమా వచ్చి సంవత్సరం గడుస్తున్నప్పటికి స్పిరిట్ సినిమాని మాత్రం స్టార్ట్ చేయలేదు. ఇక ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేసి పెట్టిన సందీప్ రెడ్డివంగ ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లడానికి చాలా రకాల కసరత్తులు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా ప్రభాస్ కి సందీప్ రెడ్డి వంగకి స్క్రిప్ట్ విషయంలో కొంతవరకు డిస్టబెన్ సెస్ వచ్చినట్టుగా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో కొన్ని సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని ప్రభాస్ సందీప్ రెడ్డివంగ తో చెప్పి వాటిని మార్చమని అడిగాడట…అయితే సందీప్ మాత్రం ఆయనకి ఆ సీన్ తాలూకు ఇంపార్టెన్స్ తెలియజేసి అవి మారుస్తే సినిమాలో ఉన్న సోల్ పోతుందని చెప్పారట. మరి దానికి ప్రభాస్ కొంత వరకు ఆయన మీద సీరియస్ అయ్యాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయం తెలియదు.
కానీ మొత్తానికైతే వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగాయని స్పిరిట్ సినిమా ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఇప్పుడు సందీప్ బాలీవుడ్ హీరో అయిన రణబీర్ కపూర్(Ranbeer Kapoor)కి ఒక కథ వినిపించాడట…మరి అది స్పిరిట్ సినిమా స్టోరీ నా అనే అనుమణులు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తంలో ఇదే టాపిక్ వైరల్ గా మారుతూ ఉండటం విశేషం… మరి వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తుందా రాదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి దర్శకుడి తో సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజానికి ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియాలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. ఇక ఇప్పుడు స్టార్ హీరోల తగ్గ రేంజ్ లో సినిమాలు చేయగలిగే దర్శకులతో సినిమాలు చేసినప్పుడే వాళ్ళ స్టామినా అనేది బయటపడుతుంది. లేకపోతే మాత్రం మళ్లీ వాళ్ల కెరియర్ అనేది డౌన్ ఫాల్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఎంచుకున్న దర్శకులలో సందీప్ రెడ్డి వంగా 100% అతనికి బాగా సెట్ అవుతాడు.
అతనితో సినిమా చేస్తే ప్రభాస్ కి సక్సెస్ రావడమే కాకుండా భారీ రికార్డులను కూడా కొల్లగొట్టే అవకాశాలైతే ఉంటాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమా మీదా వీళ్ళ గొడవ మీద సరైన క్లారిటీ రావాలి అంటే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు స్పందించాల్సిన అవసరమైతే ఉంది…