https://oktelugu.com/

Prabhas Spirit: అనిమల్ లో రన్బీర్ ని మించి స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన సందీప్…

అనిమల్ సినిమాతో మరోసారి సందీప్ రెడ్డి వంగ తన సత్తా ఏంటో చూపించాడు. వరుసగా రెండు సినిమాలతో బాలీవుడ్ ని శాసించిన తెలుగు డైరెక్టర్ గా కూడా తను మంచి రికార్డును క్రియేట్ చేశాడు.

Written By:
  • Gopi
  • , Updated On : December 26, 2023 / 04:45 PM IST
    Follow us on

    Prabhas Spirit: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ లాంటి డైరెక్టర్లు తనదైన రీతిలో సినిమాలు చేస్తూ వాళ్ల సత్తా ఏంటో చూపించుకున్నారు. ఆయన చేసిన అర్జున్ రెడ్డి సినిమాతోనే తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాకుండా ఒక సినిమాని సూపర్ సక్సెస్ అయ్యే విధంగా ఆ స్క్రిప్ట్ లోనే చాలా మార్పులు చేసి ఆ స్టోరీ ప్రేక్షకుడికి నచ్చేలా చేసి తెరపైన ఒక అద్భుతమైన దృశ్య కావ్యం గా మలిచి విక్టరీని సాధించారు. అప్పటివరకు ఉన్న మూస ధోరణి స్క్రిప్ట్ లన్నింటికీ స్వస్తి పలుకుతూ ఆయన తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా ప్రేక్షకులందరికీ విపరీతంగా నచ్చింది.

    ఈ సినిమాని హిందీలో కబీర్ సింగ్ పేరిట రీమేక్ చేశాడు అక్కడ కూడా సూపర్ సక్సెస్ అవ్వడంతో రణ్బీర్ కపూర్ హీరోగా సందీప్ డైరెక్షన్ లో అనిమల్ అనే సినిమా చేశారు. ఇక సినిమాను అనౌన్స్ చేసినప్పటి నుంచి ఆ సినిమా మీద హైప్ పీక్స్ లో క్రియేట్ అయింది. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ఈనెల ఒకటోవ తేదీన రిలీజ్ అయింది. దాంతో ఈ సినిమా కలక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఇక అందులో భాగంగానే ఈ సినిమా మీద కూడా జనాలు పెట్టుకున్నా అంచనాలన్నిటిని చిత్ర యూనిట్ మొదటి షో తోనే చాలా సక్సెస్ ఫుల్ గా రీచ్ అవ్వగలిగారు. ఇక దాంతో ఈ సినిమా ఇప్పటివరకు 800 కోట్లకు పైన వసూళ్లను రాబట్టింది. ఇక ఈ సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్లు కలక్షన్స్ ని సొంతం చేసుకుంటుందంటు సినిమా యూనిట్ అయితే ఇప్పటికి కూడా చాలా మంచి కాన్ఫిడెంట్ తో ఉంది…

    ఈ సినిమాతో మరోసారి సందీప్ రెడ్డి వంగ తన సత్తా ఏంటో చూపించాడు. వరుసగా రెండు సినిమాలతో బాలీవుడ్ ని శాసించిన తెలుగు డైరెక్టర్ గా కూడా తను మంచి రికార్డును క్రియేట్ చేశాడు. ఇక ఇది ఇలా ఉంటే ఆయన నెక్స్ట్ ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ ని ఒక డిఫరెంట్ అవతారంలో చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటివరకు ప్రభాస్ చేయని ఒక డిఫరెంట్ పాత్ర లో ప్రభాస్ కనిపింకాబోతున్నట్లుగా వార్తలు అయితే వస్తున్నాయి.

    ఇక అనిమల్ లో ఎలాగైతే హీరో త్రీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపిస్తాడో ఇక ఈ సినిమాలో కూడా ప్రభాస్ అలానే కనిపించబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒకటి సైకో టైప్ ఆఫ్ పాత్ర అని కూడా తెలుస్తుంది…చూడాలి మరి సందీప్ ప్రభాస్ ని ఏ రేంజ్ లో చూపిస్తాడో…,