Aishwarya Rai Daughter: ఐశ్వర్య రాయ్ ను మించి ఆరాధ్య.. యాక్టింగ్ వీడియో వైరల్

తాజాగా ఆరాధ్య బచ్చన్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. అదికూడా ఆరాధ్య యాక్టింగ్ కు సంబంధించిన వీడియో కావడం విశేషం.

Written By: Neelambaram, Updated On : December 26, 2023 4:57 pm
Follow us on

Aishwarya Rai Daughter: సాధారణంగా సినీ రంగానికి చెందిన వారి పిల్లలు బయటకు కనిపించడం అరుదు. ఏదో ఒక ఈవెంట్ లో కానీ, ఫంక్షన్ వంటి కార్యక్రమాల్లో కెమెరాలకు చిక్కిన ప్రతిసారి వారి గురించి చర్చ హాట్ టాపిక్ గా మారుతుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంటాయి.

తాజాగా ఆరాధ్య బచ్చన్ కు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తుంది. అదికూడా ఆరాధ్య యాక్టింగ్ కు సంబంధించిన వీడియో కావడం విశేషం.

ఆరాధ్య బచ్చన్.. బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనుమరాలు. స్టార్ దంపతులు అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్యరాయ్ గారాలపట్టి. ఆమె ప్రస్తుతం ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ లో విద్యను అభ్యసిస్తున్నారన్న సంగతి తెలిసిందే. అయితే స్కూల అన్యూవల్ డే సందర్భంగా స్కూల్ యాజమాన్యం ఓ ఫంక్షన్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఆరాధ్య ఓ నాటకం వేశారు. అది ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ కు సంబంధించిన యాడ్ అనే భావనను కలిగిస్తుంది. ఇదంతా కాసేపు పక్కన పెడితే నాటకంలో భాగంగా ఆరాధ్య పెద్ద పెద్ద డైలాగులను సైతం అవలీలగా చెప్పేసింది. దీంతో యాక్టింగ్ లో తల్లిదండ్రులకు ఏ మాత్రం తీసిపోదనే భావన ప్రతి ఒక్కరికి కలగిందనడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.

ట్విట్టర్ వేదికగా బయటకు వచ్చిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. యాక్టింగ్ లో తల్లిని మించిపోయేలా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేయగా మరికొంతమంది ఎంతైనా బిగ్ బీ కుటుంబం కదా.. ఆ మాత్రం యాక్టింగ్ చేయలేకపోతే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా స్కూల్ లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ లు కలిసి హాజరవడం విశేషం. ఇద్దరూ స్కూల్ లోకి కలిసి వెళ్లిన ఫొటోలు సైతం వైరల్ గా మారాయి. మరోవైపు ఐశ్వర్య – అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారంటూ వస్తున్న రూమర్స్ కు బ్రేక్ పడిందని తెలుస్తోంది.