https://oktelugu.com/

Salaar Movie: రీ షూటింగ్ కి సిద్దమైన ప్రభాస్ “సలార్” మూవీ… కారణం ఏంటంటే?

Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్త్రభాస్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. వరుసగా పాన్ ఇండియా కథలనే లైన్లో పెడుతున్నాడు ప్రభాస్. ఆయన మొదలుపెట్టిన ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ చాలా కాలం పాటు జరిగింది. మధ్యలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి కొంతకాలం గ్యాప్ వచ్చింది. అలానే కొన్ని సన్నివేశాలను రీషూట్ కూడా చేశారు. దీనివలనే సినిమా రిలీజ్ కు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 10:44 AM IST
    Follow us on

    Salaar Movie: పాన్ ఇండియా స్టార్ ప్త్రభాస్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘బాహుబలి’ సినిమా తరువాత ప్రభాస్ రేంజ్ మారిపోయింది అని చెప్పాలి. వరుసగా పాన్ ఇండియా కథలనే లైన్లో పెడుతున్నాడు ప్రభాస్. ఆయన మొదలుపెట్టిన ‘రాధేశ్యామ్’ సినిమా షూటింగ్ చాలా కాలం పాటు జరిగింది. మధ్యలో లాక్ డౌన్ కారణంగా షూటింగ్ కి కొంతకాలం గ్యాప్ వచ్చింది. అలానే కొన్ని సన్నివేశాలను రీషూట్ కూడా చేశారు. దీనివలనే సినిమా రిలీజ్ కు ఆలస్యమైంది. ఫైనల్ గా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కాబోతుంది.

    Salaar Movie

    Also Read: రాజమౌళి కారణంగానే పవన్ ను పోటీలోకి దించుతున్నాడు !

    అయితే ఇప్పుడు ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ సినిమా కూడా రీషూట్ జరుపుకుంటుందని తెలిసి ప్రభాస్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని కాస్త త్వరగానే పట్టాలెక్కించేశారు. 2020 డిసెంబర్‌‌లో అనౌన్స్ చేసి, 2021 జనవరిలో షూటింగ్ స్టార్ట్ చేసేశారు. చిత్రీకరణ కూడా వేగంగానే కానిచ్చారు. 2022 ఏప్రిల్ 14న సినిమాని రిలీజ్ చేయనున్నట్టు కూడా ప్రకటించేశారు. షూటింగ్ జరుగుతున్న స్పీడ్‌ని బట్టి అనుకున్న సమయానికి రిలీజ్ చేయడం గ్యారంటీ అని ఫిక్సయ్యారంతా. అయితే ఈ మూవీలోని కొన్ని సీన్స్‌ని మళ్లీ తీయబోతున్నారని తాజాగా వార్తలు వస్తున్నాయి. సలార్‌‌కి క్లైమాక్స్ ఎంత ఇంపార్టెంటో, ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని మొదట్నుంచీ చెబుతున్నారు మేకర్స్.

    అయితే ఇంటర్వెల్ సీన్స్ శ్హూటింగ్ పూర్తయింది కానీ అవి తాను అనుకున్న స్థాయిలో రాలేదని ప్రశాంత్ నీల్ ఫీలవుతున్నాడట. మరోసారి చిత్రీకరిస్తే మంచిదను కుంటున్నాడట. ప్రభాస్ లాంటి ప్యాన్ ఇండియా స్టార్‌‌తో సినిమా చేస్తున్నప్పుడు ఏ విషయంలోనూ కాంప్రమైజ్ కాకూడదనే పట్టుదలతో ఉన్నాడట ప్రశాంత్ నీల్. అందుకొరకే ఈ రీ షూట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

    Also Read: అరెరే.. ‘పుష్ప’లో ఆ కళ మిస్ అయిందే !