https://oktelugu.com/

Sleep Tips: రాత్రిళ్ళు నిద్రసరిగా పట్టడం లేదా.. ఈ చిట్కాలు పాటించాల్సిందే?

Sleep Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఈ ఉరుకుల పరుగుల కాలంతో పాటు పరిగెత్తడం వల్ల తిండి నిద్ర మానేస్తే నిరంతరం కష్టపడుతూ ఉన్నారు.ఈ క్రమంలోనే అధిక ఒత్తిడికి లోనవడం వల్ల కొందరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలలో నిద్రలేమి సమస్య ఒకటి. ప్రస్తుత కాలంలో అధిక పని ఒత్తిడి కారణంగా చాలామంది రాత్రులు నిద్ర లేక ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమస్యను అధిగమించాలంటే ఈ చిన్న చిట్కాలను పాటించాల్సిందే.. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : December 7, 2021 / 10:43 AM IST
    Follow us on

    Sleep Tips: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు ఈ ఉరుకుల పరుగుల కాలంతో పాటు పరిగెత్తడం వల్ల తిండి నిద్ర మానేస్తే నిరంతరం కష్టపడుతూ ఉన్నారు.ఈ క్రమంలోనే అధిక ఒత్తిడికి లోనవడం వల్ల కొందరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలలో నిద్రలేమి సమస్య ఒకటి. ప్రస్తుత కాలంలో అధిక పని ఒత్తిడి కారణంగా చాలామంది రాత్రులు నిద్ర లేక ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమస్యను అధిగమించాలంటే ఈ చిన్న చిట్కాలను పాటించాల్సిందే..

    Sleep Tips

    రాత్రిళ్లు నిద్ర లేని వారు ఇంటిలో లావెండర్ ఉపయోగించడం వల్ల అందులో నుంచి వెలువడే సువాసన మంచి నిద్రను కలిగించడానికి ఉపయోగపడుతుంది. లావెండర్ సువాసన కేవలం ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అందాన్ని కూడా కాపాడుతుంది. నిద్రపోయే ముందు సిల్క్ స్లీప్ ఐ మాస్క్ ను ఉపయోగించడం వల్ల నిద్రలేమి సమస్యను అధిగమించవచ్చు. ఈ మాస్క్ నిద్రను కలిగించడమే కాకుండా ముఖంపై ముడుతలు లేకుండా కాపాడుతుంది.

    Also Read: గుడ్లను ఎక్కువగా తింటున్నారా.. ఈ తప్పు చేస్తే ప్రాణాలకే ప్రమాదం?

    Sleep Tips

    కొన్నిసార్లు అధిక ఒత్తిడికి లోనవడం వల్ల మన మెదడు నిద్రను నిరోధిస్తుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం ప్రయత్నించాలి. ఈ క్రమంలోనే ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటూ మంచి శ్వాస తీసుకోవడం వల్ల అధిక ఒత్తిడి తగ్గుతుంది. వీటితో పాటు మన బెడ్రూమ్ లో ఎంతో ఆహ్లాదకరంగా ఉండేలాగా డోర్ కర్టెన్స్ లేదా ఎంతో ఆహ్లాదకరమైన పూల కుండీలను పెట్టడం వల్ల ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది.

    Also Read: ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వంట ఇదే..?