https://oktelugu.com/

Jagan Govt: ఏపీలో గుట్కా, జర్ధా రాయుళ్లకు షాకిచ్చిన జగన్ సర్కార్

Jagan Govt: పొగాకు ఉత్పత్తులపై రాష్ర్ట ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో రాష్ర్టంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్కా ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపింది. రాష్ర్టంలో వాటి రవాణా, విక్రయం తదితర వాటిపై సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై రాష్ర్టంలో ఎక్కడ కూడా పొగాకు ఉత్పత్తులు కానరాకూడదని నిబంధన తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇక పొగాకు ఉత్పత్తులు కనిపించకూడదు. ఒక వేళ కనబడితే చట్టపరంగా శిక్షార్హులవుతారని చెప్పింది. ప్రజారోగ్యం రీత్యా పొగాకు […]

Written By:
  • Srinivas
  • , Updated On : December 7, 2021 / 10:47 AM IST
    Follow us on

    Jagan Govt: పొగాకు ఉత్పత్తులపై రాష్ర్ట ప్రభుత్వం నిషేధం విధించింది. దీంతో రాష్ర్టంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుట్కా ఉత్పత్తులపై ఉక్కుపాదం మోపింది. రాష్ర్టంలో వాటి రవాణా, విక్రయం తదితర వాటిపై సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై రాష్ర్టంలో ఎక్కడ కూడా పొగాకు ఉత్పత్తులు కానరాకూడదని నిబంధన తెచ్చింది. ఈ నేపథ్యంలో ఇక పొగాకు ఉత్పత్తులు కనిపించకూడదు. ఒక వేళ కనబడితే చట్టపరంగా శిక్షార్హులవుతారని చెప్పింది.

    Jagan Govt

    ప్రజారోగ్యం రీత్యా పొగాకు ఉత్పత్తులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. కరోనా ప్రభావం కంటే పొగాకు ఉత్పత్తులతోనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తున్న క్రమంలో గుట్కా ఉత్పత్తులను సంపూర్ణంగా నిషేధించింది. సంవత్సరం పాటు వీటిపై నిషేధం కొనసాగించనుంది. నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ తదితర రోగాలతో జనం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2006లో ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, నిల్వ, రవాణాలను నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ అమల్లోకి తీసుకొచ్చింది. దీని ప్రకారం పొగాకు ఉత్పత్తులను రాష్ర్టంలో కనిపించకుండా చేయడమే లక్ష్యంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే వాటిని నిషేధిస్తూ ఉత్తర్వుల జారీ చేసింది.

    Also Read: Jagan vs Raghurama: అనవసరంగా పెట్టుకొని జగన్ అభాసుపాలయ్యారా?

    పొగాకు ఉత్పత్తుల వినియోగంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు రోగాల బారిన పడుతున్నారు. అయినా వాటి వినియోగం మాత్రం ఆగడం లేదు. ఆస్పత్రుల్లో రూ. లక్షలు ఖర్చు చేస్తున్నా వాటిని వాడటం మానడం లేదు. దీంతో వారి ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు విషమిస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులను నిషేధిస్తూ చట్టం తీసుకురావడంపై అందరిలో హర్షం వ్యక్తమవుతోంది. పలు స్టేట్లలో కూడా పొగాకు ఉత్పత్తులను ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే.

    Also Read: Amma Vodi Scheme: అమ్మఒడి కావాలా? తల్లిదండ్రులకు ఈ షాకిచ్చిన జగన్

    Tags