https://oktelugu.com/

సింగరేణిలో ప్రభాస్ యాక్షన్ !

కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన కన్నడ దర్శకుడు ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరగబోతోందట. రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఇక్కడ పది రోజుల పాటు షూటింగ్‌ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ […]

Written By:
  • admin
  • , Updated On : January 28, 2021 / 09:35 AM IST
    Follow us on


    కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన కన్నడ దర్శకుడు ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో పాన్ ఇండియా సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. అయితే, పెద్దపల్లి జిల్లా రామగుండం పరిధిలోని సింగరేణి ఓపెన్‌ కాస్ట్ ప్రాంతంలో ఈ సినిమా షూటింగ్ జరగబోతోందట. రామగుండం-3 పరిధిలోని సింగరేణి ఓసీపీ-2లో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించనున్నారట. ఇక్కడ పది రోజుల పాటు షూటింగ్‌ జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సెట్టింగ్ పనులు జరుగుతున్నాయట.

    Also Read: ‘వర్క్ ఫ్రం హోం’పై జాన్వి ఘాటు వ్యాఖ్యలు

    ఇక ఎలాగూ ప్రభాస్ సినిమాల్లో హీరోయిన్ అంటే.. నేషనల్ రేంజ్ ఫాలోయింగ్ ఉంటేనే ఆమెను హీరోయిన్ గా ఫైనల్ చేస్తూ వస్తున్నారు గత కొన్ని సినిమాలుగా. సాహోలో శ్రద్ధాకపూర్ తో రొమాన్స్ చేశాడు ప్రభాస్. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రాబోతున్న సైన్స్ – ఫిక్షన్ సినిమాలో దీపిక పదుకోణును, త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న ఆదిపురుష్ లో కృతి సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. కాగా ఇప్పుడు ఇదే ఊపులో సలార్ కోసం కత్రినాకైఫ్ ను తీసుకోబోతున్నారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

    Also Read: కేజీఎఫ్2 నైజాం హక్కులకు అంత డిమాండా?

    కాగా 2021లో లోపే ఈ సినిమాని పూర్తీ చేయాలని చూస్తున్నాడు ప్రభాస్. కాకపోతే, ప్రశాంత్ నీల్ కూడా రాజమౌళిలా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడనే పేరు ఉంది కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించాలి. ఎలాగూ ప్రభాస్ కూడా సలార్ పైనే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కాబట్టి.. రానున్న ఐదు నెలలు మొత్తం ప్రభాస్ సలార్ కోసమే కేటాయించనున్నాడు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్